
నైతిక ప్రవర్తన: డబ్బుతో లేదా దానికి సంబంధించిన ఏదైనా పనిలో ఎల్లప్పుడూ నిజాయితీ, చిత్తశుద్ధి, నైతిక ప్రవర్తన పాటించాలి. అనైతిక మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు దీర్ఘకాలిక శ్రేయస్సు లేదా ఆనందాన్ని తీసుకురాదని చాణక్యుడు చెప్పాడు. ఈ క్రమంలో వ్యక్తి తనలోని సమగ్రతను కాపాడుకోడమే కాక తన నమ్మకాన్ని దృఢపరుచుకోవాలని సూచించాడు.

పరస్పర గౌరవం: వ్యక్తిగా మీ జీవిత భాగస్వామి పట్ల గౌరవాన్ని పెంపొందించుకోండి. భార్యాభర్తలు తమ ఆలోచనలు, భావాలను గుర్తించడానికి ప్రయత్నించండి. గౌరవంగా చూసుకోండి. జీవిత భాగస్వామిలోని మంచి లక్షణాలను మెచ్చుకోండి. ఇలా చేయడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. అలాగే సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది.

అనుభవాల నుండి నేర్చుకోండి: జీవితంలో తగిలే ఎదురుదెబ్బ, బాధలో ఒక పాఠం దాగి ఉంటుందని చాణక్యుడు నమ్మాడు. ఈ అనుభవాలను వృద్ధి, స్వీయ-అభివృద్ధికి అవకాశాలుగా ఉపయోగించండి. పరిస్థితిని విశ్లేషించండి, అంతర్లీన కారణాలను అర్థం చేసుకోండి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను నివారించడానికి అనుభవాలనుంచి పాఠాలను నేర్చుకోండి.

అసూయ: ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మీ పట్ల అసూయపడే వ్యక్తి నుండి ఎల్లప్పుడూ దూరం ఉండాలి. మీ విజయాలకు లేదా సంపద చూసి అసూయపడే .. లేదా కుళ్లుకునే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. వీరి స్నేహం ప్రతికూల భావోద్వేగాలను కలిగించవచ్చు. లేదా హానికలిగించవచ్చు. లేదా అల్లకల్లోలానికి దారి తీయవచ్చు. అంతేకాదు జీవితంలో కొన్ని మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నా అసూయ పరులు ఆ అవకాశాలను మీ దగ్గరకు చేరనివ్వకుండా చేస్తారు.
