
మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆదాయం అత్యధికంగా వృద్ధి చెంది, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలను కూడా సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. కొత్తగా వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు పొందుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకుంటారు.

వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా మంచి గుర్తింపు లభించి అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో స్తబ్ధత తొలగిపోయి, యాక్టివిటీ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశినాథుడైన బుధుడితో రవి కలవడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ఆశించిన పదోన్నతుల లభిస్తాయి. వ్యాపారాల్లో ఈ రాశివారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరుల వివాదాలు, సమస్యలను కూడా పరిష్కరిస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

ధనుస్సు: ఈ రాశికి మూడవ స్థానంలో రవి, బుధులు కలవడం వల్ల బుధాదిత్య యోగంతో పాటు, ధర్మ కర్మాధిపయోగం కూడా కలిగింది. ఫలితంగా ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామా జికంగా కూడా హోదా పెరుగుతుంది. మీ మాటలను ప్రతి ఒక్కరూ ఆదరించి గౌరవిస్తారు. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. తండ్రి నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.

మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన పురోగతితో పాటు ఆదాయపరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఎక్కువగా శుభవార్తలు వింటారు. సోదరులతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కుంభం: ఈ రాశిలో బుధ, రవుల కలయిక చోటు చేసుకున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్రగతిన పురోగతి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. తప్పకుండా అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి ఇది చాలా వరకు అనుకూల సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు సర్దుమణుగుతాయి.