Tirumala: నేడు ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం .. రాత్రి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్న సీఎం జగన్

|

Sep 18, 2023 | 8:36 AM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. యాగశాలలో భూమాతకు పూజలు నిర్వహించి నవధాన్యాలను నాటారు. 

1 / 8
ఈ రోజు నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ...తొమ్మిది రోజులు పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రం 6:15 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 

2 / 8
రాత్రి 8 గంటలకు శ్రీవారి పట్టువస్త్రాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి సమర్పించనున్నారు. బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలను తీసుకుని వెళ్లి సీఎం జగన్ స్వామివారికి సమర్పించనున్నారు. 

3 / 8
ఈ నేపథ్యంలో నేడు తిరుపతికి సీఎం జగన్ పయనం కానున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.

4 / 8
అనంతరం 3.50 గంటలకు తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్వయంగా భవనాలను ప్రారంభించనున్నారు

5 / 8
అంతేకాదు ఇక్కడే టీటీడీ ఉద్యోగులకు సీఎం జగన్ ఇంటి స్థలాల పంపిణీ చేయనున్నారు. 

6 / 8
ఇళ్ల స్థలాల పంపిణీ అనంతరం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మను సీఎం జగన్ దర్శించుకుని అమ్మవారికి పూజలు చేయనున్నారు. అనంతరం నేరుగా తిరుమలకు పయనం కానున్నారు.

7 / 8
 తిరుమలకు చేరుకున్న తర్వాత సీఎంజగన్ సాయత్రం 5.40 గంటలకు తిరుమలలో వకుళమాత రెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు.  అక్కడి నుంచి పద్మావతి అతిధి గృహం చేరుకుని రాత్రి 7:45 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకుని సీఎం శ్రీవారికి సమర్పించనున్నారు.

8 / 8
బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి 9 గంటలకు పెద్దశేషవాహనంపై ఊరేగనున్నారు  శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి. ఈ పెద్ద శేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. 