వర్షం కోసం ఇదేం పూజ బాబోయ్.. గాడిదలకు స్వీట్ ట్రీట్

Updated on: Jul 19, 2026 | 11:37 AM

భారత దేశంలో ఆచార సంప్రదాయాలకు కొదవలేదు. చాలా మంది ఇప్పటికీ తమ తమ నమ్మకాలు, ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. అయితే వర్షాలు పడక ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వానలు కురవాలని వారి వారి ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల కప్పలకు పెళ్లీ చేస్తే మరికొన్ని చోట్ల మాత్రం గాడిదలకు గులాబ్ జామ్‌లు తినిపిస్తున్నారు. కాగా, దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
ప్రస్తుతం వర్షాలు పడటం లేదు. వర్షాకాలం ప్రారంభం అయినప్పటికీ చాలా రాష్ట్రాల్లో వర్షం పడటం లేదు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 35 జిల్లాలలో ఇప్పటి వరకు సాధారణం కంటే తక్కువ వర్షాపాతం నమోదు అయ్యింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడాలి అని పూజలు చేస్తున్నారు.

2 / 5
వరుణుడి కోసం  పూజలు చేస్తున్నారు. అయితే వర్షాధిపతి అయిన ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి భోపాల్ ప్రజలు గాడిదలకు గులాబ్ జామ్‌లు తినిపిస్తున్నారు. ఈ ఆచారం పూర్వకాలం నుంచే వస్తుందని వారు చెప్పుకొస్తున్నారు. వర్షాలు పడాలి అని భోపాల్‌లో ఉదయం 11 గంటలకు అక్కడి ప్రజలు గాడిదలకు గులాబ్ జామ్‌లు తినిపించడం జరిగింది. అంతే కాకుండా ఇంద్రుడికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.

3 / 5
దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వర్షాలు పడాలి అని కప్పలకు పెళ్లీలు చేయడం చూశాం, కానీ గాడిదలకు గులాబ్ జామ్ తినిపించడం చాలా ఆశ్చర్యంగా ఉందని కొందరు అంటున్నారు. ఇక రుతుపవనాలు ప్రారంభమైనప్పటికీ భోపాల్‌లో ఇప్పటివరకు సరైన విధంగా వర్షాలు పడటం లేదు. దీంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడాలి అని అక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నట్లు, వారు తెలియజేస్తున్నారు.

4 / 5
ఇక ఇలా గాడిదలకు గులాబ్ జామ్ తినిపించడం మంచిది కాదు అని వెటర్నరీ నిపుణులు తెలియజేస్తున్నారు. గాడిదలకు గులాబ్ జామ్ తినిపించడం వలన సమస్యలు వస్తాయి, ఇది రెగ్యులర్ డైట్‌లో ఉండకూడదని వారు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో వర్షాలు సరిగ్గా పడక పోవడంతో చాలా ప్రాంతాల్లోని ప్రజలు ఇలా వింత వింత ఆచారాలు పాటిస్తున్నారు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us