
2026 జనవరి 23న సూర్యుడు మకర రాశి నుంచి శ్రవణా నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. న్యాయకత్వం, కీర్తికి ప్రతీక అయిన సూర్యగ్రహం సంచారం కొన్ని రాశుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తుంది. దీని వలన కొన్ని రాశుల వారు కుటుంబ కలహాల నుంచి బయటపడతారు. వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం చేకూరుతుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది. కుటుంబసభ్యులతో తీర్థ యాత్రలు చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం చాలా అద్భుతంగా ఉండనుంది. అత్యధిక లాభాలు పొందే వారిలో వీరే ముందుంటారు. ఇక ఈ రాశి వారు సూర్య గ్రహం నక్షత్ర సంచారం వలన అధిక లాభాలు అందుకుంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి కోరిక నెరవేరుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

సింహ రాశి : సూర్య గ్రహ నక్షత్రం సంచారం కారణంగా సింహ రాశి వారికి ప్రతి పనిలో అడ్డంకులు తొలిగిపోయి చాలా ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చు తగ్గుతుంది. ఈ రాశి వారు కుటుంబ సమస్యల నుంచి బయటపడి చాలా ఆనందంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి.

మేష రాశి : మేష రాశి వారికి సూర్యుడు శ్రవణ నక్షత్రంలోకి సంచారం చేయడం వలన అద్భుతంగా ఉంటుంది. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదే విధంగా పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. అదే విధంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా వీరికి చాలా బాగుంటుంది.