Zodiac SIgns: శని, రాహువుల ప్రభావంతో పని ఒత్తిడి! ఈ రాశులకు చెందిన ఉద్యోగులకు ఆఫీసులో అత్యధిక పనిభారం ఖాయం..

| Edited By: Janardhan Veluru

Jul 06, 2023 | 11:28 AM

సాధారణంగా వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి, బరువు బాధ్యతలు మోస్తూ ఉండడానికి శని, రాహు గ్రహాలే కారణం. వీరి దృష్టి పడినా బరువు బాధ్యతలు పెరిగిపోతాయి. శుభ గ్రహాల వల్ల వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాఫీగా సాగిపోతాయి. ప్రస్తుతం గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి స్థూలంగా వృత్తి ఉద్యోగ జీవితాలు ఎలా గడిచిపోయేదీ ఇక్కడ అధ్యయనం చేద్దాం.

1 / 13
కొంత మందికి వృత్తి, ఉద్యోగాలలో పనిభారం, బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఉక్కిరిబిక్కిరయిపోతుం టారు. విశ్రాంతి ఉండదు. మరి కొంత మందికి పని
భారమేమీ ఉండదు. ఆడుతూ పాడుతూ విధులు నిర్వర్తిస్తుంటారు. సాధారణంగా వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి, బరువు బాధ్యతలు మోస్తూ ఉండడానికి శని, రాహు గ్రహాలే కారణం. వీరి దృష్టి పడినా బరువు బాధ్యతలు పెరిగిపోతాయి. శుభ గ్రహాల వల్ల వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాఫీగా సాగిపోతాయి. ప్రస్తుతం గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి స్థూలంగా వృత్తి ఉద్యోగ జీవితాలు ఎలా గడిచిపోయేదీ ఇక్కడ అధ్యయనం చేద్దాం.

కొంత మందికి వృత్తి, ఉద్యోగాలలో పనిభారం, బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఉక్కిరిబిక్కిరయిపోతుం టారు. విశ్రాంతి ఉండదు. మరి కొంత మందికి పని భారమేమీ ఉండదు. ఆడుతూ పాడుతూ విధులు నిర్వర్తిస్తుంటారు. సాధారణంగా వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి, బరువు బాధ్యతలు మోస్తూ ఉండడానికి శని, రాహు గ్రహాలే కారణం. వీరి దృష్టి పడినా బరువు బాధ్యతలు పెరిగిపోతాయి. శుభ గ్రహాల వల్ల వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాఫీగా సాగిపోతాయి. ప్రస్తుతం గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి స్థూలంగా వృత్తి ఉద్యోగ జీవితాలు ఎలా గడిచిపోయేదీ ఇక్కడ అధ్యయనం చేద్దాం.

2 / 13
మేషం: ఈ రాశిలో ప్రస్తుతం గురు, రాహువులు సంచరిస్తున్నప్పటికీ, ఈ రాశి మీద శని దృష్టి కూడా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో ఒక్కోసారి పనిభారం ఎక్కువగా
ఉండడం, ఒక్కోసారి పనిభారం ఏమీ లేకపోవడం వంటివి జరుగుతుంటాయి. మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. సొంత బాధ్యతలతో పాటు మధ్య మధ్య ఇతరుల బాధ్యతలను కూడా తలకెత్తుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రత్యేక బాధ్యతలు కూడా తప్పనిసరి అవుతాయి. అయితే, ఈ రాశివారికి పని భారం లేదా బరువు
బాధ్యతలు పెరగడం వల్ల ఆకర్షణీయమైన ప్రతిఫలం ఉంటుంది.

మేషం: ఈ రాశిలో ప్రస్తుతం గురు, రాహువులు సంచరిస్తున్నప్పటికీ, ఈ రాశి మీద శని దృష్టి కూడా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో ఒక్కోసారి పనిభారం ఎక్కువగా ఉండడం, ఒక్కోసారి పనిభారం ఏమీ లేకపోవడం వంటివి జరుగుతుంటాయి. మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. సొంత బాధ్యతలతో పాటు మధ్య మధ్య ఇతరుల బాధ్యతలను కూడా తలకెత్తుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రత్యేక బాధ్యతలు కూడా తప్పనిసరి అవుతాయి. అయితే, ఈ రాశివారికి పని భారం లేదా బరువు బాధ్యతలు పెరగడం వల్ల ఆకర్షణీయమైన ప్రతిఫలం ఉంటుంది.

3 / 13
వృషభం: శని, రాహు గ్రహాల సంచారంతో, దృష్టితో సంబంధం లేకుండా ఈ రాశివారికి సర్వకాల, సర్వావస్థలా పనిభారం ఎక్కువగానే ఉంటుంది. నెలలో ఎక్కువసార్లు ఇతరుల బాధ్యతలను కూడా పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. వృషభ (ఎద్దు) రాశివారు సార్థక నామధేయులు. పైగా ప్రస్తుతం దశమ స్థానంలో అంటే వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన స్థానంలో శనీశ్వరుడి సంచారం కూడా జరుగుతున్నందువల్ల పని భారం, ఒత్తిడి, బాధ్యతలు పెరగడమే తప్ప తరగడం అంటూ ఉండకపోవచ్చు. కొద్ది ప్రతిఫలంతో ఎటువంటి పనినైనా పూర్తి చేస్తారు.

4 / 13
మిథునం: వృత్తి ఉద్యోగాలలో విధులను నిర్వర్తించే విషయంలో ఈ రాశివారు కొద్దిగా లౌక్యంగా, వివేకంగా వ్యవహరిస్తుంటారు. సాధారణంగా ఇతరుల బాధ్యతలను
పంచుకోవడం జరగదు. తమ బాధ్యతలనే ఇతరులకు పంచుతుంటారు. భారీగా ప్రతిఫలం లేనిదే బరువు బాధ్యతలు మోయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం శని, రాహు గ్రహాలు కూడా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఎక్కువగా పని భారం, పని ఒత్తిడి ఉండకపోవచ్చు. విశ్రాంతికి, విరామానికి ఎక్కువగా
ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.

మిథునం: వృత్తి ఉద్యోగాలలో విధులను నిర్వర్తించే విషయంలో ఈ రాశివారు కొద్దిగా లౌక్యంగా, వివేకంగా వ్యవహరిస్తుంటారు. సాధారణంగా ఇతరుల బాధ్యతలను పంచుకోవడం జరగదు. తమ బాధ్యతలనే ఇతరులకు పంచుతుంటారు. భారీగా ప్రతిఫలం లేనిదే బరువు బాధ్యతలు మోయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం శని, రాహు గ్రహాలు కూడా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఎక్కువగా పని భారం, పని ఒత్తిడి ఉండకపోవచ్చు. విశ్రాంతికి, విరామానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.

5 / 13
కర్కాటకం: గుర్తింపు కోసం పాటుబడే తత్వం ఈ రాశివారిది. ఈ రాశివారికి ప్రస్తుతం అష్టమ శని నడుస్తున్నందువల్ల, ఉద్యోగ స్థానంలో రాహు సంచారం వల్ల పని
ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా వీరి ప్రతిభను, శ్రమను ప్రశంసించి అధికారులు వీరితో ఎక్కువ పని చేయించుకోవడం జరుగుతుంటుంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన దశమ స్థానం మీద శని దృష్టి పడినందువల్ల పని భారం, ఒత్తిడి, బరువు, బాధ్యతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతిఫలం తక్కువగానే ఉన్నా శ్రమ పడడానికి ఈ రాశివారు వెనుకాడరు.

కర్కాటకం: గుర్తింపు కోసం పాటుబడే తత్వం ఈ రాశివారిది. ఈ రాశివారికి ప్రస్తుతం అష్టమ శని నడుస్తున్నందువల్ల, ఉద్యోగ స్థానంలో రాహు సంచారం వల్ల పని ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా వీరి ప్రతిభను, శ్రమను ప్రశంసించి అధికారులు వీరితో ఎక్కువ పని చేయించుకోవడం జరుగుతుంటుంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన దశమ స్థానం మీద శని దృష్టి పడినందువల్ల పని భారం, ఒత్తిడి, బరువు, బాధ్యతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతిఫలం తక్కువగానే ఉన్నా శ్రమ పడడానికి ఈ రాశివారు వెనుకాడరు.

6 / 13
సింహం: ప్రస్తుతం సప్తమ రాశిలో శనీశ్వరుడి సంచారం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశివారు
ఇతరుల మీద తన బాధ్యతలను తోసేయడంలో ముందుంటారు. మంచి ప్రతిఫలం ఉన్నా ఇతరుల బాధ్యతలను, అదనపు బాధ్యతలను మోయడానికి సిద్ధపడే అవకాశం ఉండదు. అయితే, శని సంచారం వల్ల కొంత కాలం వరకు పని భారం మోయడం తప్పనిసరి కావచ్చు. అధికారుల నుంచి కొద్దిగా ప్రశంసలు, అభినందనలు అందితే వీరు కొంత సహకరించే అవకాశం ఉంటుంది.

సింహం: ప్రస్తుతం సప్తమ రాశిలో శనీశ్వరుడి సంచారం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశివారు ఇతరుల మీద తన బాధ్యతలను తోసేయడంలో ముందుంటారు. మంచి ప్రతిఫలం ఉన్నా ఇతరుల బాధ్యతలను, అదనపు బాధ్యతలను మోయడానికి సిద్ధపడే అవకాశం ఉండదు. అయితే, శని సంచారం వల్ల కొంత కాలం వరకు పని భారం మోయడం తప్పనిసరి కావచ్చు. అధికారుల నుంచి కొద్దిగా ప్రశంసలు, అభినందనలు అందితే వీరు కొంత సహకరించే అవకాశం ఉంటుంది.

7 / 13
కన్య: సాధారణంగా వీరు పని భారానికి, పని ఒత్తిడికి కాస్తంత దూరంగానే ఉంటారు. సహచరుల ద్వారా పనిచేయించడంలో వీరికి వీరే సాటి. ప్రస్తుతం శని, రాహు
గ్రహాలు కూడా అందుకు అనుకూలంగా ఉన్నందువల్ల ఎక్కువగా బరువు బాధ్యతలు స్వీకరించే అవకాశం లేదనే చెప్పాలి. ఈ రాశి నాథుడైన బుధ గ్రహమే వీరికి ఉద్యోగ స్థానాధిపతి కూడా అయినందువల్ల సాధారణంగా వీరి మీద పనిభారం పడే అవకాశం ఉండదు. వీరు అటువంటి ఉద్యోగాలనే లేదా వృత్తులనే ఎంపిక చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి.

కన్య: సాధారణంగా వీరు పని భారానికి, పని ఒత్తిడికి కాస్తంత దూరంగానే ఉంటారు. సహచరుల ద్వారా పనిచేయించడంలో వీరికి వీరే సాటి. ప్రస్తుతం శని, రాహు గ్రహాలు కూడా అందుకు అనుకూలంగా ఉన్నందువల్ల ఎక్కువగా బరువు బాధ్యతలు స్వీకరించే అవకాశం లేదనే చెప్పాలి. ఈ రాశి నాథుడైన బుధ గ్రహమే వీరికి ఉద్యోగ స్థానాధిపతి కూడా అయినందువల్ల సాధారణంగా వీరి మీద పనిభారం పడే అవకాశం ఉండదు. వీరు అటువంటి ఉద్యోగాలనే లేదా వృత్తులనే ఎంపిక చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి.

8 / 13
తుల: శుభ గ్రహాల అనుకూలత కారణంగా ప్రస్తుతం వీరి వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండి నడకలా సాగిపోతాయి. వీరు తమ విధులను, బాధ్యతలను ఆడుతూ పాడుతూ నిర్వర్తిస్తుంటారు. ఆకర్షణీయమైన ప్రతిఫలం లేదా ప్రోత్సాహకం ఉన్న పక్షంలో కొద్దిపాటి బాధ్యతలను నెత్తికెత్తుకోవడానికి, ఇతరులతో విధులు పంచుకోవడానికి వీరికి అభ్యంతరం ఉండకపోవచ్చు. వీరి వృత్తి, ఉద్యోగాల ఎంపిక కూడా ఇదే దృక్పథంతో జరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఎక్కువగా ఉంటుంది.

9 / 13
వృశ్చికం: ప్రస్తుతం వృత్తి, ఉద్యోగాల స్థానాన్ని శని వీక్షిస్తున్నందువల్ల నిర్విరామంగా, అవిశ్రాంతంగా పని చేయడం, బరువు బాధ్యతలను మోయడం తప్పనిసరి అవుతుంది. ఒక్క వృత్తి, ఉద్యోగాలలోనే కాదు, ఇంటా బయటా కూడా చాకిరీ పెరుగుతుంది. అధికారులతో పాటు, సహోద్యోగులు సైతం తమ బాధ్యతలను, తమ విధులను ఈ రాశివారికి అప్పగించే సూచనలున్నాయి. ప్రతిఫలం లభించే అవకాశం కూడా లేకపోవచ్చు. అర్ధాష్టమి కారణంగా ఈ రాశివారికి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా ఆదుకునే అవకాశం కూడా తక్కువగా ఉండవచ్చు.

10 / 13

ధనుస్సు: శని, రాహువుల ప్రభావమేమీ లేకపోవడం, శుభ గ్రహాల అనుగ్రహం ఎక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశం లేదు. నిజానికి పనిభారాన్ని నెత్తికెత్తుకోకపోవడం, ఆడుతూ పాడుతూ పనిచేసుకు పోవడం ఈ రాశివారి నైజం. తక్కువ పనితో ఎక్కువ లాభం పొందడం వీరికి తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చు. ప్రశంసలు, అభినందనలు, ప్రోత్సాహకాల కారణంగా ఎప్పుడైనా
కొద్దిగా పనిభారం మోసే అవకాశం ఉంటుంది.

ధనుస్సు: శని, రాహువుల ప్రభావమేమీ లేకపోవడం, శుభ గ్రహాల అనుగ్రహం ఎక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశం లేదు. నిజానికి పనిభారాన్ని నెత్తికెత్తుకోకపోవడం, ఆడుతూ పాడుతూ పనిచేసుకు పోవడం ఈ రాశివారి నైజం. తక్కువ పనితో ఎక్కువ లాభం పొందడం వీరికి తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చు. ప్రశంసలు, అభినందనలు, ప్రోత్సాహకాల కారణంగా ఎప్పుడైనా కొద్దిగా పనిభారం మోసే అవకాశం ఉంటుంది.

11 / 13
మకరం: ఈ రాశికి అధిపతి శనీశ్వరుడే అయినందువల్ల వీరు జీవితంలో పనిభారం నుంచి తప్పించుకునే అవకాశమే ఉండదు. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కూడా ఎంతటి పని భారానికైనా, ఎంతటి ఒత్తిడికైనా తమంతట తామే సిద్ధపడిపోవడం జరుగుతుం టుంది. సాధారణంగా ఈ రాశివారు ముగ్గురు చేసే పని చేస్తుంటారు. కొద్దిపాటి ప్రోత్సాహం లేదా ప్రోత్సాహకంతో వీరు తృప్తిపడుతూ ఉంటారు. వీరు విశ్రాంతిగా, విరామంగా కూర్చునే అవకాశమే ఉండదు. ప్రస్తుతం దశమ స్థానాన్ని రాహు గ్రహం వీక్షిస్తున్నందువల్ల పనిభారానికి లోటుండదు.

12 / 13
కుంభం: ఈ రాశికి కూడా శనీశ్వరుడే అధిపతి. పైగా ఈ రాశివారికి ఏలిన్నాటి శని కూడా జరుగుతోంది. తప్పకుండా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహచరులే కాదు, అధికారులు కూడా తమ బాధ్యతలను వీరికి అప్పగించే అవకాశం ఉంటుంది. బహుశా వారాంతపు సెలవు కూడా వీరు అనుభవించలేకపోవచ్చు. చాకిరీ కోసమే
పుట్టినట్టుగా ఉంటుంది వీరి పరిస్థితి. ఈ రాశివారికి శనీశ్వరుడు దశమ స్థానాన్ని వీక్షిస్తున్న కారణంగా ఉద్యోగంలో అధికార యోగానికి కూడా అవకాశం ఉన్నప్పటికీ, శ్రమ, ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది.

కుంభం: ఈ రాశికి కూడా శనీశ్వరుడే అధిపతి. పైగా ఈ రాశివారికి ఏలిన్నాటి శని కూడా జరుగుతోంది. తప్పకుండా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహచరులే కాదు, అధికారులు కూడా తమ బాధ్యతలను వీరికి అప్పగించే అవకాశం ఉంటుంది. బహుశా వారాంతపు సెలవు కూడా వీరు అనుభవించలేకపోవచ్చు. చాకిరీ కోసమే పుట్టినట్టుగా ఉంటుంది వీరి పరిస్థితి. ఈ రాశివారికి శనీశ్వరుడు దశమ స్థానాన్ని వీక్షిస్తున్న కారణంగా ఉద్యోగంలో అధికార యోగానికి కూడా అవకాశం ఉన్నప్పటికీ, శ్రమ, ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది.

13 / 13
మీనం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రభావం కారణంగా కొద్దిగా పని ఒత్తిడి పెరిగే సూచనలున్నప్పటికీ, మొత్తం మీద వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగానే సాగిపోయే అవకాశం ఉంది. అధికార వర్గాల నుంచి ఆదరణ, గౌరవ మర్యాదలు పెరగడం వల్ల పని భారం బాగా తగ్గడం జరుగుతుంది. ఈ రాశి నాథుడే దశమ స్థానాధిపతి కూడా అయినందువల్ల సాధారణంగా వీరికి పనిభారం ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేదు. వీరు చేసే ఉద్యోగాలు, చేపట్టే వృత్తులు పని ఒత్తిడికి అవకాశం లేనివే అయి ఉంటాయి. శారీరక శ్రమకన్నా మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది.