
వాస్తు శాస్త్రం అనేక విషయాల గురించి తెలియజేస్తుంది. అలాగే ఆది వారం రోజు చేయకూడని పనుల గురించి కూడా వాస్తు శాస్త్రం తెలిపుతుంది. ఆది వారం సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు, అయితే ఈ రోజున అస్సలే కొన్ని వస్తువులు కొనుగోలు చేయకూడదంట. చేస్తే దురదృష్టం కలుగుతుందంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

ఆది వారం రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కొనకూడదంట. దీని వలన దరిద్రం నీ వెంట తెచ్చుకున్నట్లేనంట. ఆది వారం సూర్య భగవానుడికి సంబంధించినది, ఉప్పు రాహుకు సంబంధించినది. అయితే వీరు వ్యక్తిరేక స్వభావం కలిగి ఉండటం వలన ఆది వారం ఉప్పు కొనుగోలు చేయడం వలన ఇంటిలో ప్రతికూలత పెరుగుతుందంట.

ఆది వారం రోజు ఉప్పు కొనుగోలు చేయడం వలన రెండు గ్రహల చెడు ప్రభావం మీపై ఉంటుందంట. దీని వలన ఇంటిలో ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట. అందుకే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కొనుగోలు చేయకూడదు అని చె బుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అంతే కాకుండా ఈరోజు ఉప్పు వాడకం కూడా తగ్గించాలంట. దీని వలన రాహు, సూర్య దోషాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈరోజు బెల్లంతో చేసిన స్వీట్స్ తీసుకోవడం చాలా మంచిదంట. ఇది సానుకూలతను ప్రేరేపిస్తుంది.

ఉప్పును ఆది వారం కాకుండా సోమవారం లేదా శుక్రవారం కొనుగోలు చేయడం చాలా శభప్రదం అంటున్నారు వాస్తు నిపుణులు. ఇది చంద్రుడికి సంబంధించినది కాబట్టి, సోమవారం లేదా శుక్రవారం కొనుగోలు చేయడం వలన మానసిక ప్రశాంతత పెరుగుతుందంట.