
తుల రాశి : తుల రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వీరికి ఈ సంవత్సరం తిరుగే ఉండదు. సూర్యుడు ధన కారక ఇంట్లో సంచరించడం వలన వీరికి ఆదాయానికి కొరతే ఉండదు, రోజు రోజుకు డబ్బులు పెరుగుతాయి. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు.

మేష రాశి : మేష రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి రాహు సంచారం వలన అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి, ఖర్చుల ఇంట్లోకి శని సంచారం వలన ఖర్చులు కాస్త తగ్గిపోతాయి. కానీ ఆదాయం మాత్రం విపరీతంగా పెరుగుతుంది. అంతే కాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకుంటారు ఈ రాశి వారు.

వృషభ రాశి : ఈ రాశి వారికి చాలా రోజుల నుంచి మధ్యలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. వీరు ఈ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించుకుంటారు, సంపద విపరీతంగా పెరుగుతుంది. ఖర్చులు కూడా తగ్గుతాయి. దీని వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది, ఈ రాశి వారికి అదృష్ట గ్రహం బృహస్పతి, ఈయన ఉచ్ఛ స్థితిలో ఉండటం వలన ఆదాయం రెట్టింపు అవుతుంది. అంతే కాకుండా ఖర్చులు కూడా తగ్గిపోయి, బ్యాంకు బ్యాలెన్స్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి సంపదకు కారకుడైన శుక్ర గ్రహం, ఆదాయం ఇంట్లో, పదకొండవ ఇంట్లో సంచరించడం వలన వీరికి డబ్బుకు కొదవే ఉండదు, ఆదాయం విపరీతంగా పెరుగుతంది. ఖర్చులు పూర్తిగా తగ్గుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.