
Astrological Remedies for Wednesday: హిందూ మతంలో వారంలో ప్రతి రోజును ఆయా దేవతలకు అంకితం చేయడం జరిగింది. జీవితంలో విజ్ఞాలు తొలగించే గణపతిని బుధవారం నాడు పూజిస్తారు. ఈ రోజున గణేషుడిని పూజించడం వలన జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోయి.. అంతా శుభమే కలుగుతుందని విశ్వాసం.

జాతకంలో బుధ గ్రహ స్థానం బలహీనంగా ఉంటే జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బుధుడు స్థానాన్ని సరి చేయడానికి కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాల్సి ఉంది.

జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే బుధవారం నాడు పొరపాటున కూడా కొనుగోలు చేయకూడనివి చాలా ఉన్నాయి. వాటిని కొనుగోలు చేయడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

బుధవారం కొత్త బట్టలు, కొత్త బూట్లు, చెప్పులు కొనకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అలాగే బుధవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఈ రోజు రుణం ఇవ్వడం వల్ల డబ్బు కొరత ఏర్పడుతుంది. అప్పు తిరిగి పొందడం కూడా కష్టంగా మారుతుంది. అందుకే రుణాలు ఇవ్వడం మానుకోవాలని సూచిస్తున్నారు వేద పండితులు.

జుట్టుకు సంబంధించిన దువ్వెన, నూనె, హెయిర్ డ్రైయర్, బ్రష్, సబ్బు వంటివి బుధవారం కొనుగోలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధుడు మరింత బలహీనపడుతాడు.

Anemia Food