Navaratri 2024: అరకిలో బంగారం, 1500 కేజీల స్వీట్స్ సారెను అమ్మవారికి సమర్పించిన భక్తులు.. ఎక్కడంటే

| Edited By: Surya Kala

Oct 09, 2024 | 10:12 AM

కొత్తకోడలు ఇంటికి వచ్చినపుదు నిర్ణీత కాలంలో సారె పంచటం అనే సాంప్రదాయం హిందూ వివాహ వ్యవస్థ కు కొనసాగింపుగా జరిగే ఒక కార్యక్రమం. పెళ్లి జరిగిన 16 వ రోజున లేదా నెల రోజుల్లోపు మరికొందరైతే మూడు మాసాలలోపు అమ్మాయిని అత్తవారింటికి పంపేటపుడు సారెను సైతం తమ కూతురి వెంట అత్తారింటికి పంపుతారు. ఈ సారెను అత్తింటి వారు తన కోడలు కాపురానికి వచ్చిందని తమ బంధుమిత్రులకు, చుట్టుపక్కల వారికి చెబుతూ పసుపు, కుంకుమతో పాటు కోడలు తీసుకువచ్చిన మిఠాయిలు, చలిమిడి, అరటిపళ్ళు ఇతర తినుబండారాలు అందరికి పంచుతారు.

1 / 9
ఇలా సారేను ఎంత పంచాలి , ఎంత మందికి ఇవ్వాలి అనేది ఎవరి శక్తి , సామర్ద్యాల ఆధారంగా ఉంటుంది. అయితే ఈ సారెను ఎందుకు పంచాలి అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చిన ఆడపిల్లకు అక్కడ ఉండే వ్యక్తులు, బంధువులు అందరూ కొత్త వారు. ఆమెను పరిచయం చేయటంతో పాటు ఇతరులకు నోరు తిపిచేయటం ద్వారా , పసుపు, కుకుమ పంచటం ద్వారా శుభం జరుగుతుందని చెబుతుంటారు.

2 / 9
ఇదే సాంప్రదాయం దేవాలయాలకు కూడా కొనసాగుతుంది. ఉత్సవాలు, పండుగల సమయంలో ప్రముఖ దేవాలయాలకు సారెను ఒకదేవాలయం నుంచి మరో దేవాలయానికి తీసుకువెళ్లటం కూడా ఆనవాయితీ, సాంప్రదాయంగా జరుగుతుంది.

3 / 9
ప్రస్తుతం దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా విజయవాడ దుర్గ గుడిలో జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు ద్వారకతిరుమల, అన్నవరం , కాణిపాకం తదితర అలయాల నుంచి దుర్గామ్మకు సారె ఘనంగా చేరుకుంది.

4 / 9
ఇకే ఇదే ఆనవాయితి ఇటీవల కాలంలో గ్రామ దేవతలు కొలువు దీరిన ప్రాంతాల్లోనూ కొనసాగుతుంది. ఆషాడ మాసంలో కూడా అమ్మవార్లకు చీర జాకెట్లతో పాటు పలు రకాల వెరైటీ వంటకాలతో  ఆషాడం సారె పెడుతున్నారు.  అయితే తాజాగా 1500 కేజీల అంటే సుమారుగా ఒక టన్నున్నర  బరువు గల స్వీట్లతో అమ్మవారికి సారె పెట్టారు. 500 గ్రాములు అంటే అర కేజీ బంగారంతో అమ్మవారికి బంగారు కిరీటాన్ని భక్తులు తయారు చేయించి అలంకరించి పూజలు చేశారు.

5 / 9
ఆ విషయం జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంసంగా మారింది. గ్రామస్తులు భక్తులే స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో మంచి శుభ పరిణామమని పలువురు భావిస్తున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులో జరిగింది.

6 / 9
శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో  కొలువై ఉన్న అమ్మవారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుపుతారు. ఉత్సవాల్లో ఆరవ రోజు ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఇందులో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు కోట్ల రూపాయలతో ప్రతియేటా అలంకరణ చేసేవారు. కానీ ఈ సంవత్సరం అందుకు భిన్నంగా ఏర్పాట్లు చేశారు. 
1500 కేజీల బరువు గల 11 రకాల స్వీట్లను తయారు చేయించి  అమ్మవారికి సారె పెట్టారు. స్థానిక గ్రామస్తులు, భక్తులతో పాటు ఇతర గ్రామస్తులు 2 నుంచి 10 గ్రాముల వరకు బంగారాన్ని అమ్మవారికి స్వచ్ఛందంగా అందించారు.

శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో కొలువై ఉన్న అమ్మవారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుపుతారు. ఉత్సవాల్లో ఆరవ రోజు ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఇందులో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు కోట్ల రూపాయలతో ప్రతియేటా అలంకరణ చేసేవారు. కానీ ఈ సంవత్సరం అందుకు భిన్నంగా ఏర్పాట్లు చేశారు. 1500 కేజీల బరువు గల 11 రకాల స్వీట్లను తయారు చేయించి అమ్మవారికి సారె పెట్టారు. స్థానిక గ్రామస్తులు, భక్తులతో పాటు ఇతర గ్రామస్తులు 2 నుంచి 10 గ్రాముల వరకు బంగారాన్ని అమ్మవారికి స్వచ్ఛందంగా అందించారు.

7 / 9
దీంతో రూ. 42 లక్షల విలువ గల 500 గ్రాముల  బంగారు కిరీటాన్ని అమ్మవారికి  తయారు చేయించి, మంగళ వాయిద్యాలు, మేళ తాళాల నడుమ  సుమారు 500 మంది మహిళలతో ఊరేగింపుగా 1500 కేజీల 11 రకాల వెరైటీలతో తయారు చేసిన స్వీట్లు పట్టుకుని, అమ్మవారి కిరీటంతో పాటు ఆలయానికి చేరుకొన్నారు.

8 / 9
వీటికి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో మహిళలు ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు.

9 / 9
మహా లక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారిని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు,  జనసేన నాయకుడు వట్టి పవన్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.