ఉల్లిపాయ రసం: ఉల్లిపాయ రసంతో కూడా ముఖంపై మొటిమలను అరికట్టవచ్చు. ఇందుకోసం చిటికెడు పసుపు ,చిటికెడు నిమ్మరసం కలిపి ఆ పేస్టును మొటిమలు ఉండే ప్లేస్‌లో అప్లైయ్ చేస్తే ఎటువంటి మచ్చలున్నా తొలగిపోతాయి.
వేప ఆకులు: వేపకులలోని ఎన్నో రకాల ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగానే వేప ఆకుల పేస్ట్ శరీరంపై ఏర్పడే మొటిమలను తొలగించడంలోప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఆకుల పేస్ట్‌ని మొటిమల మీద పూస్తే వాటి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
తేనె-దాల్చిన చెక్క: తేనె శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో ఉపయోగపడితే.. దాల్చిన చెక్క మొటిమలను తొలగించడానికి పని చేస్తుంది. అయితే తేనె, దాల్చిన చెక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై పూస్తే వాటిని పూర్తిగా నిరోధించవచ్చని డెర్మాటాలజిస్టులు పేర్కొంటున్నారు.
చన్నీటి స్నానం: ముఖంపై మొటిమలు, మచ్చల సమస్య ఉన్నవారు స్నానం చేయడానికి చన్నీటిని మాత్రమే ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ముఖంలోని స్కిన్ సెల్స్ ప్రభావితమై మొటిమలు తగ్గడంలో తోడ్పడుతుందంట.
మస్సాజ్: ముఖంపై మొటిమలను తొలగించడానికి మస్సాజ్ చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా ఫేస్‌పై లేదా మొటిమలు ఉన్న చోట స్క్రబ్ చేస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.