- Telugu News Photo Gallery Skin Care Tips Try these Ayurvedic tips for glowing skin here are the details
Skin Care Tips: వేసవిలో మెరిసే చర్మం కావాలా? అయితే, ఈ ఆయుర్వే చిట్కాలను ట్రై చేయండి..
చాలా సార్లు చర్మానికి రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా వేసవిలో మెరిసే చర్మం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వారికోసం ఆయుర్వేద నిపుణులు కొన్ని ఆయుర్వేద టిక్కాలను చెబుతున్నారు.
Updated on: Mar 28, 2022 | 6:47 AM

చాలా సార్లు చర్మానికి రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా వేసవిలో మెరిసే చర్మం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వారికోసం ఆయుర్వేద నిపుణులు కొన్ని ఆయుర్వేద టిక్కాలను చెబుతున్నారు. వాటిని పాటించడం ద్వారా అందమైన చర్మం మీ సొంతం అవుతుందంటున్నారు..

గంధపు పొడి: అర టీస్పూన్ గంధపు పొడిలో కొన్ని చుక్కల నీరు కలపండి. ఈ పేస్ట్‌ని ముఖం, మెడపై రాయాలి. దీన్ని 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇది మొటిమలు, ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.

నిమ్మరసం, గోధుమ పిండి, పసుపు పొడి: నిమ్మరసం, గోధుమ పిండి, పసుపును కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. నిమ్మరసానికి బదులుగా పెరుగును కూడా ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్‌ని ముఖమంతా అప్లై చేయండి. దీన్ని కాసేపు ఆరనివ్వండి. నిమ్మరసంలో ఉండే యాసిడ్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇది ముఖంపై నల్ల మచ్చలకు చికిత్స చేస్తుంది. పసుపు చర్మంపై మెరుపును తెస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

తేనె: పొడి చర్మమే కాదు జిడ్డు చర్మానికి కూడా మాయిశ్చరైజింగ్ అవసరం. ఈ సందర్భంలో, మీరు తేనెను ఉపయోగించవచ్చు. తేనె గొప్ప సహజమైన మాయిశ్చరైజర్. మీ ముఖానికి తేనెను పూయండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కడగాలి.

ముల్తానీ మిట్టి: ఒక చెంచా ముల్తానీ మిట్టి తీసుకోండి. దానికి దాదాపు మూడు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలపండి. ఈ పేస్ట్‌ని ముఖం, మెడపై రాయండి. ప్యాక్ పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచండి. ఆ తర్వాత ముఖం కడుక్కోవాలి. జిడ్డు చర్మానికి ఈ ప్యాక్ చాలా మేలు చేస్తుంది.




