Skin Care Tips: గోళ్లు, పాదాల విషయంలో మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

|

Sep 01, 2024 | 7:54 PM

మనలో చాలా మంది ముఖం, జుట్టు సౌందర్యానికి ఇచ్చిన ప్రాధాన్యత చేతులు, కాళ్ళకు ఇవ్వరు. చేతులు, కాళ్ళ చర్మం కూడా శరీరంలో భాగమే. బయటికి వెళ్లినప్పుడు మురికిగా ఉండే దుమ్ము, ధూళి ఎక్కువగా పడేది కాళ్లు, చేతుల మీదే. నేటి కాలంలో చాలా మంది రోజులో ఎక్కువ భాగం ఏసీలోనే గడుపుతున్నారు. కాబట్టి తేమతో కూడిన వాతావరణంలో మన చర్మం పొడిగా మారుతుంది. చేతులు, కాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చలా అవసరం..

1 / 5
మనలో చాలా మంది ముఖం, జుట్టు సౌందర్యానికి ఇచ్చిన ప్రాధాన్యత చేతులు, కాళ్ళకు ఇవ్వరు. చేతులు, కాళ్ళ చర్మం కూడా శరీరంలో భాగమే. బయటికి వెళ్లినప్పుడు మురికిగా ఉండే దుమ్ము, ధూళి ఎక్కువగా పడేది కాళ్లు, చేతుల మీదే. నేటి కాలంలో చాలా మంది రోజులో ఎక్కువ భాగం ఏసీలోనే గడుపుతున్నారు. కాబట్టి తేమతో కూడిన వాతావరణంలో మన చర్మం పొడిగా మారుతుంది. చేతులు, కాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చలా అవసరం. అలాగని రోజూ పార్లర్‌కు వెళ్తూ జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యం కాదు. అలాంటప్పుడు ఇంట్లోనే ఈ కింది విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

2 / 5
చర్మం తేమగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు చేతులకు, కాళ్లకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వీధుల్లో పనిచేసేవాళ్లే కాదు.. నిత్యం కిచెన్‌లో పనిచేసేవాళ్లు కూడా చేతుల సంరక్షణపై దృష్టి పెట్టాలి. వంట చేసేటప్పుడు పసుపు, కారం వంటి రకరకాల మసాలాలు చేతులకు అంటుకుంటాయి. కేవలం సబ్బుతో శుభ్రపరచడం వల్ల దుర్వాసనలు, మరకలు తొలగిపోవు. కాబట్టి వంట తర్వాత చేతులకు ఆవాల నూనె రాసుకుని పంచదార లేదా నిమ్మరసంతో బాగా రుద్దుకోవాలి.

3 / 5
ఇది అన్ని రకాల మచ్చలను తొలగిస్తుంది. చెడు వాసన కూడా మాయమవుతుంది. తర్వాత గోరువెచ్చని నీటిలో కొద్దిగా షాంపూతో చేతులను ఉంచి కాసేపు నానానివ్వాలి.  ఆ తర్వాత చేతులతో రుద్దుకుంటే మురికి వదలిపోతుంది.  చేతులను ఆరబెట్టి, మంచి హ్యాండ్ క్రీమ్‌ను అప్లై చేసుకుని, కొద్దిగా మసాజ్ చేసుకోవాలి. ఈ చిన్న టిప్స్ పాటిస్తే, చేతులు మృదువుగా మారుతాయి.

4 / 5
చాలా మంది పాత్రలు కడగడానికి రకరకాల సబ్బులు వాడడం వల్ల చేతులు లేదా కాళ్ల చర్మంపై రకరకాల అలర్జీలు కనిపిస్తాయి. ఫలితంగా చర్మం నిర్జీవమవడం ప్రారంభమవుతుంది.  ఈ సమస్య ఉంటే చేతికి గ్లౌజులు ధరించి వంట పాత్రలు శుభ్రం చేసుకోవాలి. బయటికి వెళ్లేటప్పుడు వాటర్ ప్రూఫ్ షూస్ ధరించాలి.

5 / 5
ఈ రోజుల్లో చాలా మంది నెయిల్ ఆర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న తప్పులు చేయకూడదు. నెయిల్ ఆర్ట్ కు ముందు నకిలీ గోర్ళను అతికించి, దానిపై  నెయిల్‌ ఆర్ట్‌ వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల క్రమంగా గోళ్ల ఆరోగ్యం నాశనం అవుతుంది. గోళ్లు పెళుసుగా మారుతాయి.