
హైపర్పిగ్మెంటేషన్, రంగు మారడం, డార్క్ స్పాట్స్, ఏజ్ స్పాట్స్ లేదా ఏ రకమైన అసమాన మచ్చలు అయినా మందార పువ్వు ద్వారా ఉపశమనం కలుగుతుంది.

మందార మీ చర్మాన్ని సహజంగా, సున్నితంగా శుభ్రపరచడంలో సహాయపడే సపోనిన్‌లను కలిగి ఉంటుంది. మందారలో ఆస్ట్రింజెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఓపెన్ స్కిన్ రంధ్రాలను బిగించి, మీ చర్మంలో అధిక సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి.

మందారలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతాయి. అందువలన ఇది మొటిమలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

మందారలోని జిగట పదార్ధం చర్మ కణజాలంలో తేమను ఎక్కువ కాలం లాక్ చేయడానికి సహాయపడుతుంది. దీంతో చర్మాన్నీ మృదువుగా ఉంచేందుకు తోడ్పడుతుంది.

మందార మీ చర్మంలో ఫైబ్రోనెక్టిన్ ప్రొటీన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా గాయాలను వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది. చర్మం పొరలుగా, దురదగా ఉన్నవారికి, మందార చర్మాన్ని మృదువుగా చేస్తుంది.