కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు బంగాళాదుంప చక్కటి పరిష్కారం అవుతుంది. ఆలూతో కూడా మీరు కూరలో ఉప్పును తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఉడకబెట్టిన బంగాళాదుంపల తొక్కతీసి గుజ్జుగా చేయండి. దీన్ని ఉప్పగా ఉండే కూరగాయలో వేసి కలుపుకుంటే ఉప్పు రుచి తగ్గి కూరలు టేస్టీగా అవుతాయి.
కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు టెన్షన్ పడకుండా అందులో కొన్ని తరిగిన టమాటాలు లేదంటే, టమాటా రసం పోసి కలుపుకుంటే సరిపోతుంది. టమాటాల్లో ఉండే నేచురల్ ఎసిడిటీ ఉప్పును బ్యాలెన్స్ చేస్తుంది. కావాలంటే, మీ ఇంట్లో ఎప్పుడైనా వంటల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు ఈ చిట్కాను పాటించి చూడండి.
Curd
కూరలో ఉప్పును తగ్గించడానికి మీరు బ్రెడ్ ముక్కలను కూడా ఉపయోగించవచ్చు. అవును బ్రెడ్ ముక్కలు కూడా బంగాళాదుంపల మాదిరిగా ఉప్పును గ్రహిస్తాయి. అలాగే మీరు ఉప్పును తగ్గించడానికి కొబ్బరి పాలను కూడా ఉపయోగించొచ్చు. కొబ్బరి పాలు కూడా వంటల్లో ఎక్కువైన ఉప్పును తగ్గిస్తాయి.
Sugar