
ఇప్పటికీ రోటీ పచ్చళ్ళు ఏంతో మంది తింటారు. అయితే, ఇది కొందరు మాత్రమే మంచిగా చేయగలరు. చట్నీ ఏదయినా అన్ని కరెక్ట్ గా వేసి చేస్తే అదిరిపోద్ది. చికెన్ కూడా సరిపోదు.

ఆకలి వేస్తే ఏదోకటి తినాలనిపిస్తుంది. ఇక కొందరికి కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో పల్లీల చట్నీ చేసుకుని తింటే మీరు మంచి భోజనం తిన్నామనే ఫీలింగ్ కూడా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు : పల్లీలు, ఎండుమిర్చి అయితే ఇది, లేకపోతే పచ్చిమిర్చిని అయినా తీసుకోవచ్చు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, తాలింపు కోసం.. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, నూనె, రుచికి సరి పడినంత ఉప్పు.

ముందుగా పాన్ తీసుకుని దానిలో శనగ గింజలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి లేదా పచ్చి మిర్చిని వేసి బాగా వేయించాలి

ఇక ఇప్పుడు దానిని తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో కొంచం చింతపండు కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. దానిని ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకుని తాలింపు పెట్టుకోవాలి. అంతే, వేడి వేడి పల్లీల చట్నీ రెడీ