
ప్రస్తుతం మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. చిన్న చిన్న పనులే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆరోగ్యం కోసం తీసుకునే ఖరీదైన మాత్రలు, నివారణ చర్యలు శరీరంపై తీవ్ర ప్రభావాలను చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపధ్యంలో సహజంగా గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహజమైన పద్ధతులను అనుసరించాలని, వ్యాయామం చేయాలని చెబుతున్నారు. ఎందుకంటే గుండె జబ్బులు రాత్రికి రాత్రే రావు. రోజూ చేసే పనుల ద్వారా నెమ్మది నెమ్మదిగా గుండె జబ్బుల బారిన పడుతుంది. కనుక గుండె ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచే కొన్ని చిన్న చిన్న అలవాట్లను చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏమిటంటే..

ప్రతి భోజనం తర్వాత నడక: రోజూ భోజనం చేసిన తర్వాత నడక ఆరోగ్యానికి మేలు. కనీసం 10 నిమిషాల పాటు నడిచినా రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గుతుందని తేలింది. ఈ చిన్న వ్యాయామం జీర్ణక్రియకు సహాయపడుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. జీవక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. నడక అనేది ఎంత బిజీగా ఉండే సమయంలోనైనా సరి పోయే తక్కువ శ్రమతో కూడిన, అధిక-ఫలితం కలిగిన చర్య. భోజనం తర్వాత నేరుగా సోఫా దగ్గరకు పరుగెత్తటం కంటే .. ఆరుబయట నడవడం చాలా మంచిది.

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు : మెదడు పనితీరు, గుండె ఆరోగ్యం, వాపు నివారణకు ఒమేగా-3లు చాలా అవసరం. కొవ్వు చేపలు (సాల్మన్, సార్డిన్లు), అవిసె గింజలు , వాల్‌నట్‌లు వంటి ఆహారాలను జోడించడం లేదా అద్భుతమైన ఒమేగా-3 సప్లిమెంట్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చు. అంతేకాదు అకాల వృద్ధాప్యం దరి చేరకుండా సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక ప్రతిఫలం ఇచ్చే మంచి ఆహార అలవాట్లలో ఒకటి.

నాణ్యమైన నిద్ర: సంపూర్ణ ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర కూడా ఒక మంఛి మెడిసిన్. నిద్ర లేమి వలన రోగనిరోధక శక్తి తగ్గడం , బరువు పెరగడం నుంచి మానసికంగా పొగమంచు, అధిక వ్యాధి ప్రమాదం వరకు ప్రతిదానితోనూ ముడిపడి ఉంటుంది. కనుక ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటల పాటు ప్రశాంతంగా, నిరంతరాయంగా, గాఢంగా నిద్రపోవాలి. ఇంకా చెప్పాలంటే.. ఆరోగ్యకరమైన అలవాట్లలో నిద్ర కూడా ఒకటి. తినే ఆహారం లేదా వ్యాయామ నియమావళి వలె నిద్రను కూడా తీవ్రంగా పరిగణించండి.

ప్లాస్టిక్ వద్దు గాజు ముద్దు: ముఖ్యంగా తినే ఆహారం, పానీయాలను నిల్వ చేయడానికి ఆధునికత పేరుతో ప్లాస్టిక్‌లు BPA, థాలేట్‌ల వంటి హార్మోన్ అంతరాయం కలిగించే రసాయనాలను విడుదల చేస్తాయని అంటారు. కాలక్రమేణా క్రమం తప్పకుండా వీటికి గురికావడం వల్ల, ఇవి సంతానోత్పత్తి సమస్యలు, జీవక్రియ అంతరాయం, క్యాన్సర్‌తో కూడా సంబంధం కలిగి ఉంటాయి. గాజు లేదా స్టెయిన్‌లెస్-స్టీల్ కంటైనర్‌లను ఉపయోగించడం అనేది శరీరంలో విష భారాన్ని తగ్గించడానికి సరళమైన..ప్రభావవంతమైన మార్గం.

LDL స్థాయిల నిర్వహణ: చాలామంది బరువు లేదా BMI పై శ్రద్ధ చూపుతున్నప్పటికీ.. రక్త పరీక్షల సముంలో శరీరంలో కొవ్వు స్థాయిలో హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఆరోగ్యం గురించి ఆందోళన కలిగిస్తున్నాయి. కనుక LDL కొలెస్ట్రాల్, హై-సెన్సిటివిటీ CRP (C-రియాక్టివ్ ప్రోటీన్), ఫాస్టింగ్ ఇన్సులిన్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించడం వల్ల హృదయ, జీవక్రియ ఆరోగ్యం గురించి ఖచ్చితంగా తెలుస్తుంది. కనుక ఈ పరీక్షలు గుండె వ్యాధుల లక్షణాలు కనిపించడానికి చాలా సంవత్సరాల ముందే సమస్యలను గుర్తించగలవు.