బాబోయ్.. బాదం ఎక్కువగా తింటే ఇన్ని కష్టాలా..? ఇలాంటి వారు దూరంగా ఉంటేనే బెటర్..

Updated on: Feb 27, 2025 | 9:33 PM

డ్రైఫ్రూట్స్‌లలో అగ్రభాగంలో నిలుస్తుంది బాదం.. ఇందులో మన ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాలైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. బాదం పప్పును నానబెట్టి తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే, ఎన్నో లాభాలున్నప్పటికీ బాదం పప్పును కొందరు తినకూడదని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాదంను ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
అధిక రక్తపోటు కారణంగా హార్ట్‌ ఎటాక్‌, హార్ట్‌ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల్ని కలిగిస్తుంది. అయితే మీరు కూడా హైబీపీ పేషెంట్ అయితే మాత్రం బాదం పప్పును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీపీ మందులను వాడుతూ బాదం పప్పులను తినడం చాలా డేంజర్‌ అంటున్నారు.

2 / 5
కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కూడా బాదంపప్పులు తినడం మంచిది కాదు. వీటిలో ఆక్సలేట్ సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లోకి చేరితే కాలుష్యం పేరుకుపోయి రాళ్లుగా ఏర్పడతాయి. అలానే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు వీటిని తింటే అప్పటికే రాళ్లు ఉంటే వాటి పరిమాణం పెరిగే అవకాశం లేకపోలేదు.

3 / 5
బాదం పప్పులో ఫైటిక్ యాసిడ్ ఒక  యాంటీ-న్యూట్రియెంట్. విటమిన్లు, ఖనిజాల శోషణను తగ్గిస్తుంది. బాదం పప్పులో ఆక్సలేట్‌లు ఖనిజ అసమతుల్యతకు కారణమవుతుంది
బాదం పప్పులో కొవ్వులు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే!

బాదం పప్పులో ఫైటిక్ యాసిడ్ ఒక యాంటీ-న్యూట్రియెంట్. విటమిన్లు, ఖనిజాల శోషణను తగ్గిస్తుంది. బాదం పప్పులో ఆక్సలేట్‌లు ఖనిజ అసమతుల్యతకు కారణమవుతుంది బాదం పప్పులో కొవ్వులు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే!

4 / 5
బాదం: బాదం పప్పులోని మోనోశాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. బాదం పప్పులోని ఫైబర్, ప్రోటీన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తాయి, తద్వారా బరువు నియంత్రణకు సహాయపడతాయి. ఇందులోని విటమిన్ E అధిక మొత్తంలో, బాదం పప్పు చర్మాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బాదం పప్పులోని విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. బాదంలోని కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలను బలపరుస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో బాదం తినడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

5 / 5
ఈరోజుల్లో చాలామంది అజీర్తి కడుపునొప్పి ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు ఇలాంటి వాళ్లు బాగా ఎక్కువగా తినకూడదు. బాదంపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపులో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కడుపునొప్పి గ్యాస్ సమస్యలు మరింత తీవ్రమయ్యే ఛాన్స్ ఉంది.