శుక్రాదిత్య రాజయోగం.. ఈ రాశుల జీవితాల్లో అద్భుత మార్పులు.. అన్నీ శుభశకునాలే..!

Updated on: Feb 09, 2026 | 8:57 AM

Shukra–Aditya Raja Yoga Impact: జ్యోతిష్యశాస్త్రంలో ఎంతో శుభఫలితాలు ఇచ్చే శుక్రాదిత్య రాజయోగం ప్రభావంతో సోమవారం నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూలమైన మార్పులు ప్రారంభమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రాజయోగంతో లాభం పొందే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఆయా రాశుల్లోకి ప్రవేశించడం వల్ల అరుదైన యోగాలు ఏర్పడతాయి. ఆ యోగాలు వివిధ రాశులపై శుభ అశుభ ఫలితాలను చూపిస్తాయి. తాజాగా, జ్యోతిష్యశాస్త్రంలో ఎంతో శుభఫలితాలు ఇచ్చే శుక్రాదిత్య రాజయోగం ప్రభావంతో సోమవారం నుంచి కొన్ని రాశుల వారి   జీవితాల్లో సానుకూలమైన మార్పులు ప్రారంభమవుతాయని  నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ప్రేమ సంబంధాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు, అవకాశాలు ఈ సమయంలో అందుకునే సూచనలు ఉన్నాయి. ఇక ఈ రాజయోగ ప్రభావంతో లాభాలు పొందబోయే రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఆయా రాశుల్లోకి ప్రవేశించడం వల్ల అరుదైన యోగాలు ఏర్పడతాయి. ఆ యోగాలు వివిధ రాశులపై శుభ అశుభ ఫలితాలను చూపిస్తాయి. తాజాగా, జ్యోతిష్యశాస్త్రంలో ఎంతో శుభఫలితాలు ఇచ్చే శుక్రాదిత్య రాజయోగం ప్రభావంతో సోమవారం నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూలమైన మార్పులు ప్రారంభమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ప్రేమ సంబంధాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు, అవకాశాలు ఈ సమయంలో అందుకునే సూచనలు ఉన్నాయి. ఇక ఈ రాజయోగ ప్రభావంతో లాభాలు పొందబోయే రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 6

మేష రాశి

ఈ వారం నుంచి మేష రాశి వారికి అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో చేసిన కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. పిల్లల నుంచి శుభవార్తలు విని ఆనందిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.  వ్యక్తిగత జీవితం కూడా మరింత ఆనందంగా మారే సూచనలు  కనిపిస్తున్నాయి.

మేష రాశి ఈ వారం నుంచి మేష రాశి వారికి అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో చేసిన కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. పిల్లల నుంచి శుభవార్తలు విని ఆనందిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యక్తిగత జీవితం కూడా మరింత ఆనందంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

3 / 6

వృషభ రాశి.. 

వృషభ రాశిలో జన్మించిన వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగాల్లో సహోద్యోగులు, అధికారుల మద్దతు పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. మాటల్లో సంయమనం పాటిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు.

వృషభ రాశి.. వృషభ రాశిలో జన్మించిన వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగాల్లో సహోద్యోగులు, అధికారుల మద్దతు పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. మాటల్లో సంయమనం పాటిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు.

4 / 6

సింహ రాశి..

సింహ రాశి వారికి ఈ సమయంలో కొత్త ఆశలు, కొత్త  అవకాశాలు చిగురిస్తాయి. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి కీలకమైన సలహాలు లేదా సహాయం లభిస్తుంది. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

సింహ రాశి.. సింహ రాశి వారికి ఈ సమయంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు చిగురిస్తాయి. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి కీలకమైన సలహాలు లేదా సహాయం లభిస్తుంది. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

5 / 6

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి వారికి ఈ వారం అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో పని చేసే వారికి అధికారుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందం, పరస్పర అవగాహన పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది ఎంతో అనుకూలమైన కాలంగా మారనుంది.

వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వారికి ఈ వారం అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో పని చేసే వారికి అధికారుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందం, పరస్పర అవగాహన పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది ఎంతో అనుకూలమైన కాలంగా మారనుంది.

6 / 6
కుంభ రాశి.. 

కుంభ రాశి వారికి శుక్రాదిత్య రాజయోగ ప్రభావంతో అనేక సమస్యలు ఒకేసారి పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు, కొత్త బాధ్యతలు లభిస్తాయి. జీవితంలో ఊహించని స్థాయిలో ఎదుగుదల సాధిస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, ఆనందంగా కొనసాగుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

కుంభ రాశి.. కుంభ రాశి వారికి శుక్రాదిత్య రాజయోగ ప్రభావంతో అనేక సమస్యలు ఒకేసారి పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు, కొత్త బాధ్యతలు లభిస్తాయి. జీవితంలో ఊహించని స్థాయిలో ఎదుగుదల సాధిస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, ఆనందంగా కొనసాగుతుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)