Greenland Melting: కరిగిపోతున్న ప్రపంచంలోని అతిపెద్ద మంచు ఖండం గ్రీన్లాండ్ తాజాగా ద్రవీభవించిన అతిపెద్ద మంచుముక్క..
గ్రీన్లాండ్ లో మంచు పలక కరిగిపోతోంది. దీనివలన విడుదలయ్యే నీటితో ఫ్లోరిడా 2 అంగుళాల (5 సెంటీమీటర్లు) ముంచేసేంత ఉంటుందని డానిష్ ప్రభుత్వ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
A large Ice sheet in Greenland melting
Follow us on
పోలార్ పోర్టల్ వెబ్సైట్లో తమ పర్యవేక్షణ ఫలితాలను పరిశోధకులు పోస్ట్ చేశారు. ఈ ద్రవీభవన సంఘటన 1950 నుండి గ్రీన్లాండ్లో మూడవ అతిపెద్ద ఏకైక మంచు నష్టం. 2012, 2019లో ఇంతకు ముందు ఇలా జరిగింది.
2019 లో సంభవించిన ద్రవీభవన పరిస్థితి పెద్దది అయినప్పటికీ, ఇప్పటి ఈ ద్రవీభవన ఘటన పెద్ద ప్రాంతాన్ని ప్రభావితం చేసిందని పరిశోధకులు అంటున్నారు. ఈ సంఘటనలో 22 గిగాటన్ల మంచు కరిగిందని అంచనా.
బెల్జియంలోని యూనివర్సిటీ ఆఫ్ లీజ్ యొక్క వాతావరణ శాస్త్రవేత్త జేవియర్ ఫెట్వీస్ ప్రకారం, సగానికి పైగా ద్రవ్యరాశి (12 గిగాటన్లు) సముద్రంలోకి ప్రవహించింది. ఆర్కిటిక్ ద్వీపంలో వెచ్చని గాలులు వెలువడిన తర్వాత అనూహ్యంగా వేగంగా ద్రవీభవన జరగడాన్ని గమనించిన శాస్త్రవేత్తలు వాతావరణ ప్రసరణ విధానాలలో మార్పులను నిర్ణయాత్మక కారకంగా సూచించారు.
డెన్మార్క్ వాతావరణ సంస్థ ప్రస్తుతం ఉత్తర గ్రీన్లాండ్లో వేసవి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ (68 ఫారెన్హీట్) దాటినట్లు వెల్లడించింది. ఇది వేసవి సగటు కంటే రెండు రెట్లు ఎక్కువ. ప్రపంచంలోని అతి పెద్ద ఖండాంతర ద్వీపమైన గ్రీన్లాండ్, అంటార్కిటికా అవతల భూమిపై ఉన్న ఏకైక శాశ్వత మంచు పలకకు నిలయం.
ఇది భూ గ్రహం మీద రెండవ అతిపెద్ద మంచినీటి ద్రవ్యరాశి . గ్రీన్లాండ్ మంచు పలక, అంటార్కిటికా రెండూ కలిపి ప్రపంచంలోని మంచినీటిలో 70 శాతం కలిగి ఉన్నాయి. ఈ మంచు పాలక పూర్తిగా కరిగిపోతే ప్రపంచ సముద్ర మట్టాలు 6 మరియు 7 మీటర్ల (20-23 అడుగులు) మధ్య పెరుగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.