Shiva Prajapati |
Mar 28, 2021 | 1:23 AM
భూమి పరిశీలన కోసం రూపొందించిన జీఐశాట్-1 ఉపగ్రహ ప్రయోగం వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్త్రో శనివారం ప్రకటించింది.
శాటిలైట్‌లో స్వల్ప సమస్యలు తలెత్తాయని, ఆ కారణంగా ఉపగ్రహ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్త్రో అధికారులు తెలిపారు.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జీఎస్ఎల్‌వీ-ఎఫ్10 రాకెట్ ద్వారా ఈనెల 28వ తేదీన ఈ ప్రయోగాన్ని చేపట్టాలని ఇస్త్రో నిర్ణయించింది.
తాజా నిర్ణయంతో ఈ ఉపగ్రహాన్ని ఏప్రిల్ 18వ తేదీన ప్రయోగించే అవకాశం ఉందని ఇస్త్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వాస్తవానికి ఈ జీఐశాట్-1 ఉపగ్రహ ప్రయోగాన్ని గతేడాది మార్చి5వ తేదీనే నింగిలోకి పంపాల్సి ఉంది. కానీ ఇతర కారణాల చేత అప్పుడు ప్రయోగాన్ని నిలిపివేశారు.