- Telugu News Photo Gallery Science photos Deep valley on earth at antarctica denman glacier which is bigger than dead sea valley
Deep Valley on Earth: భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం ఎక్కడ వుందో.. ఎంత లోతు ఉందో తెలుసా?
Deep Valley on Earth: భూమి మీద అత్యంత లోతైన ప్రదేశాన్ని ఇటీవల తెలుసుకున్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధన వలన భవిష్యత్ లో భూమి గురించిన మరింత సమాచారాన్ని సేకరించవచ్చని భావిస్తున్నారు.
Updated on: Jun 30, 2021 | 1:13 PM

సముద్రంలోనే అత్యంత లోతైన లోయలు ఉంటాయని ఇంతకు ముందువరకూ అనుకునేవారు. కానీ, భూమి మొత్తం మీద అత్యంత లోతైన ప్రదేశం తూర్పు అంటార్కిటికాలో డెన్మాన్ గ్లేసియర్ (హిమనీనదం) కింద ఉన్నట్లు గుర్తించారు. మంచుతో నిండివున్న ఈ లోయ లోతు సముద్ర మట్టం కన్నా 3.5 కిలోమీటర్లు (11,500 అడుగులు) ఉంది.

కొత్తగా గుర్తించిన ఈ అతి పెద్ద లోయను వైట్ కాంటినెంట్‌కు సంబంధించిన కొత్త మ్యాప్‌లో చిత్రీకరించారు. మంచు దుప్పటి కింద ఉన్న పునాది రాయిని ఈ మ్యాప్‌లో ఇంతకు ముందు ఎప్పుడూ లేనివిధంగా పూర్తిస్థాయిలో విశదీకరించారు. దీనిద్వారా దక్షిణ ధ్రువం భవిష్యత్తులో ఎలా మారగలదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి వీలుకలుగుతుంది.

ఈ లోయతో పోలిస్తే.. భూమి మీద అత్యంత లోతైన ప్రదేశమైన మృత సముద్రం తీరంలోని లోయ లోతు కేవలం సముద్రమట్టం కన్నా 413 మీటర్లు (1,355 అడుగులు) మాత్రమే. ప్రస్తుతం జరిపిన ఈ అధ్యయనంలో వేడెక్కుతున్న ప్రపంచంలో కరిగిపోతున్న హిమనీనదాల గురించి ఎన్నో విషయాలు తెలిశాయి.

అంటార్కిటికా భూభౌతిక స్వరూపాన్ని చిత్రీకరించటానికి వాయు మార్గంలో రాడార్లను ఉపయోగించారు.. కానీ ఆ సమాచారంలో అనేక అంతరాలు వచ్చాయి. అంటార్కిటికాను దశాబ్దాల పాటు రాడార్ పరికరాలు కలియదిరిగాయి. మంచును చీల్చుకుంటూ సూక్ష్మతరంగాలను లోపలికి పంపి అడగున ఉన్న పునాది రాయి భౌతికస్వరూప స్వభావాలను చూడటానికి ప్రయత్నించాయి. కానీ.. ఇంకా చాలా ప్రాంతాలకు సంబంధించిన సమాచారం లభించలేదు.

ఈ ప్రాజెక్టుపై ఆరేళ్ళ పాటు పనిచేసిన డాక్టర్ మాథ్యూ మోర్లిఘమ్ ''అంటార్కిటికా మంచు దుప్పటి కింద ఏముంది అనేది అత్యంత కచ్చితమైన చిత్రీకరణ ఇది అనటంలో సందేహం లేదు'' అని చెప్పారు. 20 కిలోమీటర్ల వెడల్పు ఉన్న డెన్మాన్ గ్లేసియర్ ది క్వీన్ మేరీ ల్యాండ్‌లోని సముద్రం దిశగా ప్రవహిస్తుంది. ఈ హిహనీనదానికి పై సూత్రాన్ని వర్తింపచేయటం ద్వారా.. ఆ మంచు సముద్ర మట్టం కన్నా 3,500 మిటర్ల కన్నా లోతుకు జారుతోందని వెల్లడైంది.





























