
సపోటాలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను దృఢపరుస్తుంది. సపోటా వృద్ధాప్యంలో అంధత్వాన్ని నివారిస్తుంది. ఇన్ని పోషకాలు ఉన్న సపోటా పండు అన్ని మార్కెట్‌లలో సులభంగా దొరుకుతాయి. పైగా ధర కూడా తక్కువే.

సపోటా పండులో విటమిన్ ఎ, సి, పొటాషియం, ఫోలేట్ కూడా అధికంగా ఉన్నాయి. ఇవి నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగిస్తాయి. సపోటాలోని బి-సి విటమిన్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఈ పండ్లు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు సపోటా పండును తినాలి. ఇతర పండ్లతో పోలిస్తే సపోటా పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కిడ్నీ స్టోన్ సమస్యను సపోటా నయం చేస్తుంది. అలాగే సపోటా ఊబకాయం సమస్యకు విరుగుడుగా పనిచేస్తుంది. జుట్టు రాలడం, చుండ్రు సమస్యను తగ్గించడానికి సపోటా పనిచేస్తుంది.

ఎముకలకు మాత్రమే కాకుండా ఈ పండులో కండరాలు, కణజాలాలను బలోపేతం చేయడానికి అవసరమైన మూలకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. హార్ట్ బర్న్, గ్యాస్ హార్ట్ బర్న్ వంటి సమస్యలు ఉన్నవారికి దాదాపు ప్రతిరోజూ సపోటా ఔషధంలా పనిచేస్తుంది.

సపోటా తినడం వల్ల ఇందులోని టానిన్ అనే సహజ పదార్ధం శరీరానికి అందుతుంది. ఫలితంగా కడుపు సంబంధిత సమస్యలను సులువుగా తొలగిస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి మంత్రంలా పనిచేస్తుంది.