
అయితే ఇప్పుడు ఆ శ్రమ ఏమీ లేకుండా, స్టవ్ మీద అస్సలు ఉడకబెట్టకుండా, నోట్లో వేస్తే అలా కరిగిపోయేలా ఎంతో రుచికరంగా ఉండే సగ్గుబియ్యం అప్పడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఈ సులభమైన చిట్కాలను పాటిస్తే ఎవరైనా సరే కేవలం ఐదు నిమిషాలలోనే ఎంతో రుచికరమైన పేపర్ అప్పడాలను సులభంగా సిద్ధం చేసుకోవచ్చు.

ఈ నోట్లో వేస్తే కరిగిపోయే సగ్గుబియ్యం అప్పడాల తయారీ కోసం మనకు కావలసిన ప్రధాన పదార్థం మంచి నాణ్యమైన సగ్గుబియ్యం. ఇందుకు ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. కొలతల ప్రకారం ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు నీటిని పోసి సుమారు రెండు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. రెండు గంటల తర్వాత చూస్తే సగ్గుబియ్యం నీటిని బాగా పీల్చుకుని పరిమాణంలో రెట్టింపు అవుతాయి. చేత్తో నొక్కితే పిండిలా సాఫ్ట్ గా అవ్వాలి. ఇప్పుడు ఈ నానిన సగ్గుబియ్యాన్ని వేడి నీటిలో వేయాలి. ఇందుకు స్టవ్ మీద గిన్నె పెట్టి ఐదు కప్పుల నీటిని బాగా మరిగించుకోవాలి. నీరు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఆ వేడి నీటిని సగ్గుబియ్యం ఉన్న గిన్నెలో పోయాలి. ఆ తర్వాత స్పూన్ తో బాగా కలిపి రాత్రంతా అలాగే నాననివ్వాలి.

మరుసటి రోజు ఉదయం చూసేసరికి సగ్గుబియ్యం వేడి నీటిని పూర్తిగా పీల్చుకుని ఎంతో సాఫ్ట్ గా, ట్రాన్స్‌పరెంట్ గా మారుతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లోకి మార్చుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా పావు టీస్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఈ బ్యాటర్ ఎంతో సాఫ్ట్ గా, పర్ఫెక్ట్ కన్సెసెస్టెన్సీ లోకి వస్తుంది. ఒకవేళ మీ బ్యాటర్ మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు . ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ లేదా మందపాటి కవర్ ను పరుచుకుని, దానిపై కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. గ్రైండ్ చేసిన సగ్గుబియ్యం బ్యాటర్ ను ఒక గరిటెతో తీసుకుని పేపర్ పై అప్పడాల లాగా చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే ఎండిన తర్వాత ఇవి చాలా పల్చగా మారుతాయి.

ఇలా తయారు చేసుకున్న అప్పడాలను ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఒక రోజు పాటు ఆరబెడితే సరిపోతుంది. సాయంత్రానికి ఇవి పూర్తిగా ఎండిపోయి పేపర్ లాగా ట్రాన్స్‌పరెంట్ గా మారుతాయి. ఆ తర్వాత వీటిని ప్లేట్ లోలోకి తీసుకుని భద్రపరుచుకోవాలి. వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు ఎంతో ఫ్రెష్ గా ఉంటాయి.

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ బాగా వేడి చేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ అప్పడాలను వేసి వేయిస్తే అవి ఆయిల్ లో వేసిన వెంటనే రెట్టింపు పరిమాణంలో తెల్లగా, ఎంతో క్రిస్పీగా వేగుతాయి. నోట్లో వేసుకుంటే పేపర్ లా కరిగిపోయే ఈ అప్పడాలను మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి. ఇది అందరికీ ఎంతో నచ్చుతుంది.