గుడ్డుతో బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఇలా తింటే కిలోలు తగ్గుతారు..
12 July 2026
Krishna
బరువు తగ్గడానికి ప్రాథమిక సూత్రం క్యాలరీలను నియంత్రించడం. ఒక పెద్ద ఉడికించిన గుడ్డులో కేవలం 78 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ ఇందులో శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.
తక్కువ క్యాలరీలు
గుడ్లలో అత్యధిక నాణ్యత కలిగిన ప్రొటీన్లు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి తోడ్పడటమే కాకుండా శరీరంలో అనవసరమైన కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రోటీన్ పవర్ హౌస్
గుడ్లు తిన్న తర్వాత కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీనివల్ల పదే పదే ఆకలి వేయడం తగ్గుతుంది. ఫలితంగా రోజంతా మనం తీసుకునే ఆహార పరిమాణం ఆటోమేటిక్‌గా తగ్గుతుంది.
ఆకలి కంట్రోల్
హై ప్రోటీన్ కలిగిన గుడ్లను జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. దీనినే థర్మిక్ ఎఫెక్ట్ అంటారు. దీనివల్ల శరీరంలో మెటబాలిజం పెరిగి, క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి.
మెటబాలిజం
ఉదయం పూట అల్పాహారంలో గుడ్లను చేర్చుకోవడం వల్ల బరువు వేగంగా తగ్గుతారని పరిశోధనల్లో తేలింది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాల కంటే ఉదయాన్నే గుడ్డు తినడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండొచ్చు.
బ్రేక్‌ఫాస్ట్‌గా బెస్ట్
గుడ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. ఇన్సులిన్ స్థాయిలు స్థిరంగా ఉండటం వల్ల కూడా బరువు పెరగకుండా నియంత్రించవచ్చు.
బ్లడ్ షుగర్ నియంత్రణ
బరువు తగ్గించే ఇతర డైట్ ఫుడ్స్‌తో పోలిస్తే గుడ్లు చాలా తక్కువ ధరలో లభిస్తాయి. పైగా ఆమ్లెట్, ఉడికించిన గుడ్డు, పోచ్డ్ ఎగ్ వంటి రకరకాల రూపాల్లో చాలా త్వరగా వీటిని తయారు చేసుకోవచ్చు.
సులభంగా వండుకోవచ్చు
చాలా మంది బరువు తగ్గడానికి గుడ్డులోని పచ్చసొనను పక్కన పెడతారు. కానీ అందులోనే విటమిన్ డి, కోలిన్ వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లను పచ్చసొనతో కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది.