
చర్మ సంరక్షణకు పార్లర్‌కు వెళ్లడం వల్ల మాత్రమే చర్మం మెరుగుపడదు. నిత్యం చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. తద్వారా మంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. చాలా మంది తమ రూపాన్ని మార్చుకోవడానికి మేకప్ సహాయం తీసుకుంటారు. ప్రస్తుతం చాలా మంది వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుంటున్నారు. కానీ అది కూడా రోజంతా మీ ముఖాన్ని అందంగా ఉంచడంలో విఫలం అవుతుంది.

మార్కెట్‌లో ఫౌండేషన్‌లు లేదా ఐలైనర్లు వాటర్‌ప్రూఫ్, బ్లష్‌లు, క్రీమ్, పౌడర్ ఆధారిత బ్లష్‌లు ఎన్ని ఉన్నా అధిక సమయం వాటర్‌ప్రూఫ్ గ్యారెంటీ ఇవ్వలేవు. మేకప్‌తో కాకుండా సహజమైన గులాబీ రంగును సొంతం చేసుకుంటే అందరి కళ్లూ మీ మీదే నిలుస్తాయి. ఈ కింది చిట్కాలు ట్రై చేస్తే మేకప్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. సహజ పద్ధతుల్లో గులాబీ రంగులో మీ చర్మాన్ని మెరిపించాలంటే..

ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఐస్ ముక్కలతో చర్మానికి మసాజ్ చేయాలి. మసాజ్ సాధనంతో చర్మాన్ని మసాజ్ చేయవచ్చు. ఇది చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మ స్థితిస్థాపకతను పెంచుతుంది. చర్మ స్థితిస్థాపకతను పెంచడానికి మీ ముఖం మీద ఐస్ క్యూబ్‌లను రుద్దవచ్చు. ఐస్‌ను మెత్తని టవల్‌లో చుట్టి చర్మంపై రుద్దాలి. ఇది చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది.

చర్మ సంరక్షణలో స్టీమ్ థెరపీ చాలా ఉపయోగపడుతుంది. వేడి నీటి ఆవిరితో ముఖ రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇది చర్మంపై పేరుకున్న మురికి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను శుభ్రపరుస్తుంది.

చాలా మంది రోజీ గ్లో పొందడానికి బీట్‌రూట్ లేదా రోజ్ ఫేస్ ప్యాక్ వేసుకుంటారు. బీట్‌రూట్ జ్యూస్ లేదా పౌడర్‌తో కలబంద జెల్‌ను మిక్స్ చేసి రెండు చెంపలకు అప్లై చేస్తే.. బుగ్గలపై ఎరుపు సహజంగా కనిపిస్తుంది.