
వంకాయ , పెరుగుతో చేసే ఆరోగ్యకరమైన రెసీపీ వంటకం. ఈ పెరుగు పచ్చడిని కొందరు అన్ని కాలాల్లో తింటారు అలాగే, ఇది శరీరానికి కూడా చలువ చేస్తుంది. ఇంకా ఇది అన్నంలోకి కూడా అదిరిపోతోంది. దీని కోసం ఎక్కువ సమయం పెట్టుకోకుండా కొద్దీ నిమిషాల్లోనే దీనిని చాలా ఈజీగా చేసేయొచ్చు. ఇంకా ఈ పెరుగు పచ్చడిలో అల్లం, పచ్చిమిర్చిని కూడా వేస్తే రుచిని ఇస్తుంది.

వంకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్దాలు : రెండు కప్పులు పెరుగు, రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, తాలింపులోకి ఆవాలు, అర కప్పు నూనె, అర టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఇంకా నాలుగు కరివేపాకు ఆకులు , కొత్తిమీరను కూడా వేసి తీసుకోవాలి.

ముందుగా వంకాయలను తీసుకుని వాటిని బాగా కాల్చుకోవాలి. అ తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అలాగే, మంచి పెరుగును కూడా తీసుకుని దానిలో కట్ చేసిన కూరగాయల ముక్కలు కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి.. ఇక ఇప్పుడు ఒక పాత్రలో పెరుగును తీసుకుని దానిలో సరిపడా నీళ్ళు పోసి ఇంకా వీటిని మజ్జిగ కవ్వంతో తిప్పుకుని తీసుకోవాలి.

వంకాయలను ఉడికించుకోవాలి : గ్యాస్ పొయ్యి లేదా వెలిగించి దాని మీద ఒక పాత్ర పెట్టి దానిలో వంకాయలతో పాటు కూరగాయల ముక్కలు, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి. ఇవి మెత్తగా అయిన తర్వాత కొద్దిగా మజ్జిగను పోసి మీడియం మంటపై ఉడికించాలి.

ఇప్పుడు పోపు పెట్టడానికి మళ్ళీ పాన్ తీసుకుని దానిలో నూనె వేసి, ఇంకా అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు , కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి ఉడికించాలి. సమ్మర్లో ఈ వంకాయ పెరుగు పచ్చడి తింటే ఒంట్లో ఉన్న వేడి కూడా పోతోంది. ఇంకా రుచిగా కావాలంటే దీనిలో దీనిలో కొత్తిమీర కూడా వేస్తే రుచిగా ఉంటుంది.