Telugu News » Photo gallery » Rice Bran Oil: These are some of Benefits Of Rice Bran Oil For Skin And Hair
Rice Bran Oil: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా? ఐతే ఈ ఆయిల్‌తో వారానికి రెండు సార్లు ఇలా చేయండి..
Srilakshmi C |
Updated on: Sep 07, 2022 | 10:23 AM
వంటల్లో ఉపయోగించే వివిధ నూనెల్లో రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఒకటి. ఈ నూనెను వంటకు మాత్రమేకాకుండా చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగిస్తారని మీకు తెలుసా? ..
Sep 07, 2022 | 10:23 AM
వంటల్లో ఉపయోగించే వివిధ నూనెల్లో రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఒకటి. ఈ నూనెను వంటకు మాత్రమేకాకుండా చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగిస్తారని మీకు తెలుసా?
1 / 5
రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఒమేగా-3, ఒమేగా-6 పుష్కలంగా ఉంటుంది. ఇవి జుట్టుకు చాలా మేలు చేస్తాయి. చిట్లిన జుట్టుతో బాధపడేవారు రైస్ బ్రాన్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.
2 / 5
సూర్యుని నుంచి వచ్చే హానికర కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. రెండు చుక్కల రైస్ బ్రాన్ ఆయిల్‌ను చర్మంపై వేసుకుని.. ఈ నూనెను చర్మం పీల్చుకునేంత వరకు మసాజ్ చేసుకోవాలి. ఇది చర్మంపై సహజ సన్ స్క్రీన్‌గా పనిచేస్తుంది.
3 / 5
రైస్ బ్రాన్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ నూనెతో రిమూవర్‌గా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. అలాగే రైస్ బ్రాన్ ఆయిత్‌తో కళ్ల కింద మసాజ్ చేయడం వల్ల కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి. ఇది కళ్ల కింద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, క్రమంగా వాపు, నల్ల మచ్చలు తగ్గుతాయి.
4 / 5
రైస్ బ్రాన్ ఆయిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు నెరసిపోవడాన్ని నివారిస్తుంది. 2-3 చుక్కల రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకొని మీ జుట్టుకు మసాజ్ చేసుకుని, కొంత సమయం తర్వాత తలస్నానం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా జుట్టు తెల్లబడకుండా నివారించవచ్చు.