ఖరీదైన యాసిడ్స్ వద్దు.. నీటిలో ఇదొక్కటి కలిపి కడిగితే చాలు.. టైల్స్ కొత్తవాటిలా మెరవాల్సిందే!

Updated on: Aug 31, 2026 | 4:18 PM

ఇంట్లో అన్నింటికంటే చికాకు తెప్పించే విషయం ఏమిటంటే.. బాత్రూమ్ నేల, టైల్స్‌పై పేరుకుపోయిన మొండి పసుపు మరకలు.. వీటిని ఎన్ని సార్లు శుభ్రం చేసినా మళ్లీ ఒకటి రెండ్రోజులకే పాత స్థితికి వస్తాయి. దీని వల్ల బాత్‌రూమ్‌ నుంచి దుర్వాసన రావడంతో పాటు నడిచేటప్పుడు జారి కిందపడే అవకాశం కూడా ఉంది. వీటిని క్లీన్ చేయడానికి జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రసాయనాలు వాడుంటారు. కానీ మన ఇంట్లొ దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సింపుల్‌గా వాటిని కొత్తవాటిలా మార్చొచ్చని చాలా మందికి తెలియదు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మొండి మరకలను తొలగించడంలో తెల్ల వెనిగర్ చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఇది నీటి, మురికిని క్షణాల్లో మాయం చేసి టైల్స్‌ను కొత్తవాటిలా చేస్తుంది. ఇందుకోసం ముందుగా కొద్దిగా తెల్ల వెనిగర్‌ను తీసుకోండి. దానిలో కొన్ఇన వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఆ ద్రావనాన్ని ఎక్కడైతే మరకలు ఉన్నాయో ఆ ప్రదేశంలో పొయండి. కాసేపు అలాగే వదిలేసి తర్వాత ఒక స్పాంజ్‌తో శుభ్రంగా తుడిచి ఆ తర్వాత నీటితో కడిగేయండి. అంటే క్షణాల్లో మీ టైల్స్ కొత్త వాటిలా మారిపోతాయి. ఒక వేళ మీ బాత్రూమ్‌లో మార్బుల్, గ్రానైట్ లేదా లైమ్‌స్టోన్ నేల ఉంటే వెనిగర్ అస్సలు వాడకండి.

2 / 5
 బాత్రూమ్ టైల్స్‌ను శుభ్రపరచడానికి బేకింగ్ సోడా కూడా ఒక సులభమైన ఇంటి చిట్కా. దీనితో క్లీన్ చేసేందుకు కొద్దిగా  బేకింగ్ సోడా తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేయండి. ఆ పేస్ట్‌ను ఎక్కడైతే మొండి మరకలు ఉన్నాయో అక్కడ, టైల్స్ జాయింట్ల, మధ్య ఉన్న మురికిపై పోయండి. 10 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత బ్రష్ లేదా స్పాంజ్‌తో రుద్ది శుభ్రమైన నీటితో కడగేయండి. ఇది టైల్స్‌పై ఉన్న పసుపు మరకలను తొలగించి క్షణాల్లోనే కొత్త మెరుపును ఇస్తుంది.

3 / 5
 అంతేకాదు మీ బాత్‌రూమ్‌ ఎప్పుడూ నీట్‌ అండ్ క్లీన్‌గా ఉండాలంటే మీరు దాన్ని క్రమం తప్పకుండా కడుగుతూ ఉండాలి, ప్రతి ఉపయోగం తర్వాత లేదా రోజుకు ఒక్కసారైనా మీరు గోరువెచ్చని నీటితో బాత్‌రూమ్‌ టైల్స్‌ను శుభ్రం చేయాలి. గోరువెచ్చని నీరు నేలపై ఉన్న మురికిని, మరకలను తొలగిస్తాయి. కడగడానికి ముందే మీరు వాష్‌రూమ్‌ టైల్స్‌పై ఉన్న చెత్తను క్లీన్ చేయండి. ఆ తర్వాత, గోరువెచ్చని నీటితో నేలను మాప్ చేయండి.

4 / 5
ఇవే కాదు మీరు ఇంట్లో గిన్నెలు కడిగేందుకు ఉపయోగించే డిష్‌ వాషర్ ద్రావనంతో కూడా టైల్స్‌ను క్లీన్ చేయొచ్చు. దీని కోసం మీరు కొద్దిగా గిన్నెలు కడిగే ద్రవాన్ని నీటితో కలిపి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఆ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపుకొని మరకలు ఉన్న ప్రాంతంలో స్ప్రే చేయండి. కాసేపు ఉంచి బ్రెష్‌తో రుద్ది క్లీన్ చేయండి. అంతే క్షణాల్లో మొండి మరకలు తొలగిపోతాయి.

5 / 5
అయితే పైన చెప్పిన నాలుగు చిట్కాలను ఉపయోగించి మీరు టైల్స్‌ను క్లీయ్ చేయొచ్చు. కానీ శుభ్రం చేసిన తర్వాత బాత్రూమ్ నేలను ఆరబెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నీరు అలానే ఉండిపోతే తేమ, సబ్బు పేరుకుపోవడమే కాకుండా, నేల జారుడుగా మారి, జారిపడి గాయపడే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి కడిగిన తర్వాత వాష్‌రూమ్‌ను ఆరబెట్టడం మర్చిపోకండి.

Loading...
Unable to load recommendations.
Follow Us