
మైగ్రేన్ వంటి సమస్యలకు కూడా టిఫిన్ స్కిప్ చేయడం ఒక కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువసేపు ఆకలితో ఉండడం తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ దాటవేసే అలవాటు క్రమంగా జీవక్రియ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. దీంతో బొడ్డు కొవ్వు, అధిక రక్తపోటు, అధిక చక్కెర, చెడు కొలెస్ట్రాల్ ఒకేసారి పెరుగుతాయి.

నిజానికి, ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కాబట్టి ఉదయం అల్పాహారం తీసుకోకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లకండి. ఏది ఏమైనా అల్పాహారం తీసుకోవడం అవసరం.

కొంతమందికి బ్రేక్ ఫాస్ట్ తీసుకోకుండా ఇంటి నుండి బయటకు వెళ్లిపోతారు. ఆ తర్వాత బయట రోడ్డు పక్కన దొరికే ఏదైనా చిరుతిళ్లు తినడం అలవాటు. అయితే, ప్రతిరోజూ ఇలా బయట తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్రేక్ ఫాస్ట్‌గా ఉదయం తీసుకునే ఆహారం రోజు మొత్తం మీ శక్తిని నిర్ణయిస్తుంది. అందుకే ఉదయం పూట ఆరోగ్య కరమైన ఆహారాలు మీ బ్రేక్ ఫాస్ట్‌లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇది మీకు రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే ఉదయం అల్పాహారంలో జ్యూస్ కూడా తీసుకోవచ్చు.