
మకర సంక్రాంతి నుంచి జగరనున్న గ్రహాల సంచారము వివిధ రాశులపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. సంక్రాంతి తర్వాత శుక్రుడు, కుజుడు, శని గ్రహాల కలయిక వల్ల అరుదైన యోగం ఏర్పడుతోంది. జనవరి 13న శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు జనవరి 16న కుజుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఈ మూడు గ్రహాలు కూడా మకర రాశిలోకి ప్రవేశించడంతో అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం 200 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏర్పడబోతోందని జ్యోతిష్కులు చెబుతున్నారు. దీంతో మకర రాశి తర్వాత పలు రాశుల వారికి స్వర్ణయుగం ప్రారంభమవుతుంది.

వృషభ రాశి ఈ త్రిగ్రాహి యోగం వృషభ రాశి వారికి సానుకూల మార్పులను తెస్తుంది. సూర్యుని ప్రత్యక్ష కోణం మీ వృత్తి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాబోతోంది. మీరు మీ కెరీర్‌లో రాణిస్తారు. పెద్ద ఒప్పందాలపై సంతకం చేసే అవకాశం ఉంది. మీ వృత్తి జీవితంలో ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు పాత అప్పులు తీరుస్తారు. ఇప్పటికే చేస్తున్న పని నుంచి ఆదాయం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. సంక్రాంతి తర్వాత ప్రతిదీ మీకు అనుకూలంగా మారుతుంది. మీ కుటుంబం సమస్యల నుంచి బయటపడుతుంది. సంపద, అదృష్టం కలిసివస్తుంది.

వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి త్రిగ్రాహి యోగం ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని తెస్తుంది. మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీకు కొత్త ఆదాయం, లాభాలు వస్తాయి. మీ వృత్తి జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. ఉమ్మడి వ్యాపారాల ద్వారా మీరు ఊహించని లాభాలు పొందుతారు. పనిలో మీ ఉన్నతాధికారుల నుంచి మీరు ప్రశంసలు పొందుతారు. మీ సహోద్యోగుల మద్దతు ఉంటుంది. విదేశాలకు వెళ్లడానికి మీకు ఎక్కువ అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలలో మీరు విజయం సాధిస్తారు. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి.

ధనస్సు రాశి ధనస్సు వారికి త్రిగ్రాహి యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ శుభ సమయంలో మీరు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు వృత్తిపరంగా పురోగతి సాధిస్తారు. విద్యార్థులు మంచి అవకాశాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారవేత్తలకు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

మకర రాశి త్రిగ్రాహి యోగం వల్ల మకర రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో అవివాహితులకు మంచి సంబంధాలు దొరుకుతాయి. వారికి కెరీర్ లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొత్తగా వివాహం చేసుకున్న వారికి పిల్లల గురించి శుభవార్త వింటారు. Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.