
కావాల్సిన పదార్థాలు: పావుకిలో రొయ్యలు, ఒక గోంగూర కట్ట, అర కప్పు ఉల్లిపాయలు ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్ఫూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక కప్పు నూనె.

ముందుగా రొయ్యలను తీసుకుని వాటిని ఉప్పుతో బాగా కడగాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, పసుపుతో క్లీన్ చేసి, దానిలో కొంచం సాల్ట్, అర టీ స్పూన్ పసుపు వేసి నీరు బయటకు వచ్చే వరకు బాగా వేయించి పెట్టుకోవాలి.

గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక గోంగూర ఆకులను, పచ్చిమిర్చి ముక్కలను వేసి వాటిని బాగా మెత్తగా మగ్గించి చల్లారిన తర్వాత మిక్సీలో కానీ, రోటిలో కానీ బాగా రుబ్బుకోవాలి.

పాన్‌లో ఆయిల్ వేసి, ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా వేయించాలి.

వేయించిన రొయ్యలను ముందుగా రెడీ చేసుకున్న గోంగూర పేస్ట్ లో వేసి, దానిలో రుచికి తగినంత ఉప్పు వేసి, వాటిలో కొంచం నీళ్లు పోసి స్టవ్ మీదే నుంచి వాటిని బాగా ఉడికించాలి. కొత్తి మీర వేసి కిందకు దించేయండమే.