
Skincare Tips: చర్మ సమస్యల నుంచి ఉపశమమనం ఇంకా మెరిసే చర్మం కోసం చాలా మంది కాస్మటిక్స్ వాడుతుంటారు. కానీ ఎండు ద్రాక్షలు నానబెట్టిన నీరు వాడితే కాస్మటిక్స్ కోసం వెచ్చించే ఖర్చును ఆదా చేసుకోవడంతో పాటు మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

ఎండుద్రాక్షలను నానబెట్టిన నీటిలో విటమిన్ B6, కాల్షియం, పొటాషియం, కాపర్ వంటి పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని కాపాడడంతో పాటు కాలుష్యాల నుంచి కాపాడతాయి.

ఎండుద్రాక్షలు నానబెట్టిన నీరు మన శరీరంలో డిటాక్స్ వాటర్‌గా పనిచేస్తుంది. ఫలితంగా శరీరంలో పేరుకుపోయిన అన్ని రకాల కాలుష్యాలను శరీరం నుంచి తొలగిస్తుంది. ఈ క్రమంలోనే మొటిమలను కూడా నివారిస్తుంది.

మొటిమల నొప్పి, వాపు, ఎర్రటి మచ్చలు, దద్దుర్లు, చర్మంపై మంట వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ నీళ్లను వాడితే సరిపోతుంది.యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పని చేసే ఈ నీళ్లు ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి.
