
Hyderabad Rains

andhra pradesh Rain Alert

వాగులు, వంకలను తలపించాయి రహదారులు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయ్. ఒక.. రెండు, మూడు రోజులుగా ఎండ వేడితో అల్లాడిన ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కరవడంతో ఉక్కపోత నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. మరోవైపు.. చిత్తూరు జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. గంటకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా ఒక్కసారిగా వర్షం దంచి కొట్టింది.

ఇదిలావుంటే.. జూలైలో కుండపోత వర్షాల తర్వాత ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నెల రోజులుగా వర్షాలు జాడలేకుండా పోయాయ్.. చాలా ప్రాంతాల్లో వరుసగా నెల రోజులపాటు చుక్కవాన లేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. నైరుతి రుతుపవనాల మందగమనమే అందుకు కారణమంటోంది వాతావరణశాఖ.

ఆగస్టులో కురవాల్సిన వర్షపాతం 21.96 సెంటీమీటర్లు అయితే.. కేవలం 7.96 సెంటీమీటర్ల మాత్రమే నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు.. ఆగస్టు నెలంతా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు ప్రజలు. అయితే.. తాజాగా.. వాతావరణ శాఖ వర్షసూచనతో అన్నదాతలు వానల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.