
కొండ చెలువలు చిన్న జంతువుల నుంచి మనుషులను కూడా అవలీలగా మింగగలవు. ఇవి ఎక్కువగా జలాశయాల సమీపంలో కనిపిస్తుంటాయి. ఇక వర్షకాలం వస్తే చాలు ఇవి పల్లె ప్రాతాలలో కూడా ఎక్కువగా కనిపిస్తాయి. వీటికి ఎక్కువగా విషం ఉండదు, కానీ ఇవి గట్టిగా చుట్టి, ప్రాణం తీసి మింగేస్తుంటాయి. అందుకే చాలా మంది వీటిని చూసి భయపడుతారు.

అయితే మనం ఎప్పుడూ చూసి భయపడే ఈ కొండ చిలువలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. కొండచిలువ రక్తం తాగడం వలన త్వరగా బరువు తగ్గుతారని చెబుతున్నారు నిపుణులు. ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారికి ఇది ఓ వరం.

కొండచిలువల రక్తం తాగడం వలన చాలా త్వరగా బరువు తగ్గుతారంట. బర్మిస్ జాతికి చెందిన కొండచిలువ రక్తంలో ప్రత్యేక అణువులు ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించడానికి అద్భుతంగా పని చేస్తాయంట. దీనిపై అధ్యయనం చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కొందరు శాస్త్ర వేత్తలు , ఎలుకలకు కొండ చెలువ రక్తం ఇవ్వగా, అవి ఎలుకలలో ఆకలిని తగ్గించి, బరువు తగ్గేలా చేసిందంట. అయితే ఇది మనుషులలో కూడా బరువు నియంత్రణకు దారి తీసే ఛాన్స్ ఉందని వారు గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ కొండచిలువ రక్తం తాగడం వలన బలహీనపడకుండా బరువు తగ్గుతారంట.

నోట్ పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.