
టోక్యో ఒలింపిక్ లో కాంస్య పతక విజేత పీవీ సింధు విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకుంది. ఈ సందర్భంగా సింధుకి పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

సింధు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం పండితులు సింధుకు వేదాశీర్వచనం అందించారు.

ఈ సందర్భంగా సింధుకి కనక దుర్గ అమ్మవారి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు దుర్గమ్మను దర్శించుకున్నానని.. అమ్మవారి ఆశీస్సులతో పతకం గెలిచానని చెప్పారు. దుర్గమ్మ దర్శనానికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు.

2024 ఒలింపిక్స్ లో పాల్గొంటానని ఈసారి ఖచ్చితంగా స్వర్ణం సాధిస్తానని సింధు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు ఆడాల్సి ఉందన్నారు.