
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం థైరాయిడ్ గ్రంథిలో ఏర్పడే అసమతుల్యత వలన హైపర్ థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం సమస్యలు సంభవించవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ సమస్య తలెత్తితే కడుపులో ఉన్న స్త్రీ, బిడ్డ ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో మహిళలు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

తినే ఆహారపు అలవాట్ల వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు రావచ్చు. ప్రెగ్నెన్సీ దశలో ఉన్న మహిళలు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎవరికైనా గర్భం రాకముందే హైపర్ థైరాయిడిజం సమస్య ఉంటే.. తినే ఆహారంలో ఉప్పు చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. థైరాయిడ్‌ను అదుపులో ఉంచే కూరగాయలను తినండి. హైపోథైరాయిడిజం సమస్యను ఎదుర్కొంటున్న గర్భణీ స్త్రీ అయోడిన్, తృణధాన్యాలు తినాలి.

దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో యోగా సహకరిస్తుంది. చెడు జీవనశైలి వల్ల థైరాయిడ్ సమస్యలు కలుగుతాయి. అటువంటి పరిస్థితిలో యోగా సాధన ద్వారా దీనిని నియంత్రించవచ్చు. అయితే గర్భణీ స్త్రీలు యోగా నిపుణుల సలహాలతో యోగా చేయాలి.

ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఎంత ఒత్తిడిని మనసుకు తీసుకుంటే.. థైరాయిడ్ సమస్య అంతగా పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ సమస్యలు సర్వ సాధారణంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో భయపడకూడదు. సరైన జీవనశైలిని అనుసరించండి.

గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యకు కారణం హార్మోన్ల అసమతుల్యత. ఇలాంటి సమయంలో స్త్రీలు సమస్యలు ఎదుర్కోవడానికి కారణం ఇదే. గర్భిణీ స్త్రీలు అంతకు ముందు నుంచే థైరాయిడ్‌తో బాధపడుతుంటే.. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేసుకోవాలి.