
పచ్చి రొయ్యలు, కంద కూరకి కావాల్సిన పదార్దాలు :పావు కిలో పచ్చి రొయ్యలు, పావు కిలో కంద ముక్కలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 10 కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, ఒక కప్పు చింతపండు రసం, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

కంద, పచ్చి రొయ్యలను ఇలా ఉడికించుకోవాలి : ముందుగా పచ్చి రొయ్యలను తీసుకుని వాటిని క్లీన్ చేసి, దానిలో అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు కూడా వేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాజా కందను తీసుకుని దానిని నాలుగు ముక్కలుగా చేసుకోవాలి.వాటిని ఉప్పు నీటిలో కొద్దీ సేపు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక పాత్ర తీసుకుని కంద ముక్కలను వేసి మెత్తగా అయ్యేవరకు బాగా ఉడికించాలి.

అయితే, వీటిని మెత్తగా కాకుండా కొంచం గట్టిగా ఉడకబెట్టాలి. ఇలా చేస్తే తినేటప్పుడు కూర మంచి టేస్టీగా ఉంటాయి. పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అది వేడయ్యాక దానిలో రొయ్యలు వేసి 10 నిమిషాల పాటు వేయించాలి. మొత్తానికి అలా ఉడికించకండి లేదంటే అవి గట్టిగా అవుతాయి. వీటిని లైట్‌గా వేపి ఒక దానిలో పక్కన పెట్టుకోవాలి.

మళ్ళీ అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక నాలుగు కరివేపాకు ఆకులు , 5 పచ్చిమిర్చి కూడా దీనిలో వేసి బాగా వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముద్ద వాసన పోయే వరకు కుక్ చేయాలి. ఆపై టమాటాలు వేసి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

ఇప్పుడు ఈ మసాలాలో కొద్దిగా పసుపు,ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసి వీటిని బాగా కలపాలి. ఉడికించిన కందను వేసి మూతపెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. వీటిని మసాలా కందలో కలుపుకోవాలి. చివర్లో రొయ్యలు, చింతపండు రసం వేసి మీడియం మంట పై 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.