
మసాలా దినుసుల్లో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి.. అలాంటి వాటిల్లో ఒకటి.. జీలకర్ర.. దీనిని పురాతనకాలం నుంచి ఉపయోగిస్తున్నారు.. జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రను తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో జీలకర్రను చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. జీలకర్రను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతుంది.. ఇవి కొవ్వు కరిగించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.

వాస్తవానికి జీలకర్రను అన్ని రకాల వంటల్లోనూ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఆహారం రుచిగా మారుతుంది.. దీనిలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. అందుకే జీలకర్రను ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి జీలకర్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీలకర్ర కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. అయితే.. ప్రతి వ్యక్తి రోజుకు 5 గ్రాముల జీలకర్ర తీసుకోవాలి. అంతేకాకుండా.. మన ఆహారంలో రెగ్యులర్ గా యాడ్ చేసుకుంటే మంచిది..

జీలకర్ర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అందుకే మీ రోజువారీ ఆహారంలో జీలకర్రను చేర్చుకోండి. జీలకర్ర జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.. ఇంకా త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ప్రతిరోజూ ఉదయాన్నే జీలకర్ర నీటిని తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ముందుగా.. జీలకర్రను నీటిలో నానబెట్టి కాసేపు మరగించాలి. ఆ తర్వాత వడగట్టి తాగాలి.. లేకపోతే.. జీలకర్రను పొడిగా చేసుకుని వేడి నీళ్లలో కలుపుకుని తాగవచ్చు..