బంగాళాదుంప రసాన్ని ముఖానికి రాస్తే ఈ సమస్యలన్నీ దూరం..మీ అందం రెట్టింపు..!

|

Nov 23, 2024 | 6:23 PM

ప్రస్తుత వాతవరణ కాలుష్యం, దుమ్ము దూళి, చెడు ఆహారపు అలవాట్లు, కెమికల్‌ ఆధారిత సౌందర్య ఉత్పత్తుల వాడకం కారణంగా చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖంలో కాంతి లేకుండా, చర్మం మెరుపును కోల్పోయి కనిపిస్తుంది. దాంతో అందంగా కనిపించేందుకు గానూ చాలా మంది పార్లర్‌లకు వెళ్లి ఖరీదైన బ్యూటీ ట్రీట్‌మెంట్లు తీసుకుంటుంటారు. కానీ, ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా మీ ఇంట్లోనే బంగాళదుంప మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
మెరిసే చర్మం కోసం బంగాళాదుంప చాలా ఉపయోగకరం అంటున్నారు నిపుణులు. బంగాళాదుంప చర్మంలోకి లోతుగా వెళ్లి శుభ్రపరుస్తుంది. ఇది ముఖంలోని మురికిని, మృతచర్మాన్ని, అదనపు నూనెను తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాల కారణంగా, బంగాళాదుంప ముడతలు, ఫైన్ లైన్ల సమస్యను తొలగిస్తుంది. దీంతో మచ్చలు, పిగ్మెంటేషన్, టానింగ్ సమస్యల నుండి బయటపడవచ్చునని చెబుతున్నారు.

2 / 5
ఇందుకోసం ముందుగా బంగాళదుంపలను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని రసం తీసుకోవాలి. ఇప్పుడు కాటన్ బాల్ తో ముఖం, మెడపై ఆ రసాన్ని పూర్తిగా అప్లై చేయాలి. దాదాపు 5 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసి 10 నిమిషాల పాటు ముఖంపై అలాగే వదిలేయాలి. దీని తర్వాత మీ ముఖాన్ని నీటితో శుభ్రంగా కడగాలి. బంగాళాదుంప చర్మం లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. మురికి, అదనపు నూనెను తొలగిస్తుంది. బంగాళాదుంపను ముఖం, మెడ చర్మంపై క్రమం తప్పకుండా ఉపయోగించవచ్చు.

3 / 5
బంగాళదుంప, పెరుగుతో కూడా చక్కటి ఫేస్‌ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా బంగాళదుంపలను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. అందులో రెండు చెంచాల పెరుగు, చిటికెడు పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ముఖంపై సుమారు 10-15 నిమిషాల పాటు ఉంచి ఆరనివ్వాలి.  ఇప్పుడు నీళ్లతో ముఖాన్ని బాగా కడగాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయడం వల్ల మెరిసే, మచ్చలేని చర్మం ఏర్పడుతుంది.

4 / 5
బంగాళదుంప, అలోవెరాతో కూడా అద్భుతమైన ఫేస్‌ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో రెండు చెంచాల అలోవెరా జెల్ తీసుకోవాలి. అందులో రెండు చెంచాల బంగాళదుంప రసం కలపండి. ఈ పేస్ట్‌ను ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఆరిన తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. దీన్ని వారానికి రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.

5 / 5
బంగాళాదుంప, టమోటా రసంతో ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక చెంచా బంగాళదుంప రసం తీసుకోవాలి. అందులో ఒక చెంచా టమోటా రసం, రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని ముఖానికి అప్లై చేసి సుమారు 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో శుభ్రంగా కడగాలి. ఈ ఫేస్ ప్యాక్‌తో మీరు మొటిమలు, మచ్చలను వదిలించుకోవచ్చు. దీని వల్ల ముఖం ఛాయ కూడా మెరుగుపడుతుంది.