Post Office: నెలకు రూ.12 వేలతో చేతికి రూ.20 లక్షలు.. ఈ పోస్టాఫీస్ అద్భుత స్కీమ్ గురించి తెలుసా..?

Updated on: Jan 09, 2026 | 7:40 PM

చాలామంది పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలంటే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని లేదా రిస్క్ తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఎటువంటి రిస్క్ లేకుండా ప్రభుత్వ హామీతో చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేస్తూ రూ.20 లక్షల భారీ నిధిని నిర్మించవచ్చని మీకు తెలుసా..? పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకం ద్వారా ఇది సాధ్యమే. మధ్యతరగతి ప్రజలకు, చిన్న వ్యాపారులకు ఈ పథకం ఒక వరప్రసాదంలా మారింది.

1 / 5
పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్..? :  ఇది కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చే సురక్షితమైన పొదుపు పథకం. ఇందులో ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కేవలం రూ. 100 తోనే మీరు ఖాతా తెరవవచ్చు. 10 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా ఈ ఖాతా ప్రారంభించవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల పేరు మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

2 / 5
వడ్డీ రేటు - కాలపరిమితి: ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ RD పై ప్రభుత్వం 6.7 శాతం వడ్డీని అందిస్తోంది. దీనిని ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. ఈ పథకం ప్రాథమిక కాలపరిమితి 5 సంవత్సరాలు. అయితే మీరు కోరుకుంటే మెచ్యూరిటీ తర్వాత మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు.

3 / 5
రూ. 20 లక్షలు ఎలా..? చిన్న చిన్న మొత్తాలు దీర్ఘకాలంలో ఎలా పెద్ద నిధిగా మారుతాయో ఈ లెక్క చూడండి. మీరు రోజుకు రూ. 400 ఆదా చేస్తే, నెలకు రూ. 12,000 పెట్టుబడి అవుతుంది. అంటే సంవత్సరానికి రూ. 1.44 లక్షలు డిపాజిట్ చేస్తారు. ఇదే విధంగా స్థిరంగా 10 ఏళ్ల పాటు పెట్టుబడి కొనసాగిస్తే, చక్రవడ్డీ ప్రభావంతో మీ పెట్టుబడి, వడ్డీ కలిపి సుమారు రూ. 20 లక్షలకు చేరుకుంటుంది.

4 / 5
ఈ పథకం ఎవరికి ప్రత్యేకం: ప్రతి నెలా స్థిరమైన పొదుపు చేయాలనుకునే వారికి, రోజువారీ ఖర్చుల నుండి మిగిలిన చిల్లరను పెద్ద మొత్తంగా మార్చుకోవాలనుకునే వారికి, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ప్రభుత్వ గ్యారెంటీ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

5 / 5
అదనపు ప్రయోజనాలు: ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత నిబంధనలకు లోబడి మీ డిపాజిట్‌పై రుణం తీసుకోవచ్చు. మీకు ఏదైనా ప్రమాదం జరిగితే మీ డబ్బు సురక్షితంగా మీ కుటుంబానికి అందేలా నామినీ సౌకర్యం ఉంది. పెద్ద మొత్తంలో డబ్బు వెనకేయడానికి ధనవంతులు కావాల్సిన అవసరం లేదు.. ఓర్పు, క్రమశిక్షణ ఉంటే చాలు.