PM Modi Road show: గుజరాత్‌లో మోడీ మెగా రోడ్ షో.. ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ప్రధాని..
Anil kumar poka |
Updated on: Dec 02, 2022 | 9:14 PM
బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రధాని మోదీ మెగా రోడ్‌షో నిర్వహించారు. అహ్మదాబాద్ లోని 16 సీట్లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో జరిగింది. రోడ్డు వెంబడి నిలబడి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ రోడ్‌షో నిర్వహించారు.
Dec 02, 2022 | 9:14 PM
ఓవైపు గుజరాత్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ జరిగిన వేళ రెండో దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. పంచమహల్ జిల్లా కలోల్‌లో జరిగన సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తనను తిట్టడానికి కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారని , మోదీని ఎంత తిడితే కమలం పార్టీ అంత బలోపేతం అవుతుందన్నారు .
1 / 7
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తనను రావణుడితో పోల్చారని అన్నారు మోదీ. రామాయణాన్ని కాంగ్రెస్ నేతలు అవమానించారని ఆరోపించారు. రామసేతును అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
2 / 7
ఓ కాంగ్రెస్ నేత తాను కుక్కచావు చస్తారని శపించారని , ఇంకోనేత హిట్లర్‌లా చస్తానని దూషించారని అన్నారు మోదీ.మోదీ మెగా రోడ్‌షో. అహ్మదాబాద్ లోని 16 సీట్లను కవర్ చేస్తూ..50 కిలోమీటర్ల మేర రోడ్‌షో
3 / 7
బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రధాని మోదీ మెగా రోడ్‌షో నిర్వహించారు. అహ్మదాబాద్ లోని 16 సీట్లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో జరిగింది. రోడ్డు వెంబడి నిలబడి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ రోడ్‌షో నిర్వహించారు.
4 / 7
గుజరాత్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యింది. 19 జిల్లాల్లో 89 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈనెల 5వ తేదీన రెండోదశ పోలింగ్ జరుగుతుంది.
5 / 7
తొలిదశలో పలువురు ప్రముఖులు ఓటేశారు. జామ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్ధిగా ఉన్న క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. రవీంద్ర జడేజా కూడ ఓటేశారు.
6 / 7
సూరత్‌లో కూడ చురుగ్గా ఓటింగ్ జరిగింది. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ సూరత్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ సీనియర్ మంత్రి సీఆర్ పాటిల్ కూడా తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.