5 / 7
భారత్-చైనా సరిహద్దులోని పితోర్‌గఢ్‌కు చేరుకున్న దేశానికి తొలి ప్రధాని నరేంద్ర మోదీయే కావడం విశేషం. భారత్-చైనా సరిహద్దులోని పితోర్‌గఢ్ జిల్లాలో ఉన్న గుంజి గ్రామాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతోనూ సమావేశమయ్యారు. ప్రధానమంత్రి సంప్రదాయ సంగీత వాయిద్యాలను కూడా వాయించారు. గ్రామస్తులు తయారు చేస్తున్న స్థానిక ఉత్పత్తులను ప్రధాని మోదీ ప్రశంసించారు.