Asaduddin Owaisi : జగన్ కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్.. ఏపీ రాజకీయాల్లో కొత్త కలకలం

|

Mar 07, 2021 | 12:16 PM

Asaduddin Owaisi : ఏపీలో జరుగుతోన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగడం ద్వారా ఎంఐఎం తన బేస్ ను విస్తరించే ప్రయత్నం మొదలుపెట్టింది..

1 / 7
రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన దరిమిలా ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూడని ఎంఐఎం ఇప్పుడు దృష్టి సారించింది. అంతేకాదు, వస్తూ వస్తూనే సంచలన ప్రకటనతో రాజకీయం షురూ చేశారు ఆపార్టీ అధిపతి అసదుద్దీన్ ఒవైసీ.

2 / 7
ఇటీవలే 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొన్న 'ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)' పార్టీ.. పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా, ఇన్నేళ్ల తర్వాతగానీ ఆంధ్రప్రదేశ్ పై పట్టుకోసం ప్రయత్నాలు ప్రారంభించకపోవడం విశేషం.

3 / 7
తాజాగా ఏపీలో జరుగుతోన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగడం ద్వారా ఎంఐఎం తన బేస్ ను విస్తరించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ క్రమంలో సహజంగానే బీజేపీతోపాటు అధికార వైసీపీనీ మజ్లిస్ టార్గెట్ చేసింది.

4 / 7
సంచలనాలకు కేంద్రంగా ఉండే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.. ఏపీ సీఎం జగన్ పై, వైసీపీ కీలక నేతలపై తీవ్ర కామెంట్లు చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు.

5 / 7
 'జగన్‌... జాగ్రత్త.... బీజేపీ తరుముకొస్తోంది' అంటు హెచ్చరించారు అసదుద్దీన్‌ ఓవైసీ. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ సూచనలు చేశారు ఎంఐఎం చీఫ్‌. వైసీపీ మేల్కోకుంటే భారీ ముప్పు తప్పన్నారు. ఎంఐఎం తరఫు పోటీ చేస్తున్న 9 మందిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

6 / 7
రాష్ట్రంలో ఆలయాలపై దాడులు కూడా కొందరు హిందుత్వవాదుల పనిగానే ఓవైసీ అనుమానించారు. బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ అధినేతను ఇంటికే పరిమితం చేయడం ద్వారా టీడీపీని తుదముట్టించాలని కూడా బీజేపీ చూస్తోందని అసద్ వ్యాఖ్యానించారు.

7 / 7
అసదుద్దీన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వీటిపై రాజకీయవర్గాల్లోనే కాదు, ఏపీ ప్రధాన రాజకీయపార్టీల్లోనూ ఈ వ్యాఖ్యలపై చర్చ కొనసాగుతోంది.