
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నామినేషన్ల దాఖలు చేసిన పలువురు ముఖ్య నాయకులు.

శని, ఆదివారాలు సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. ఇక ఈ రోజు ముహూర్తం బాగుండడంతో నామినేషన్ల దాఖలుకు పోటీపడ్డ నేతలు

మక్కల్ నీది మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. కోయంబత్తూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు

కమల్ సహా అతని నేతృత్వంలోని ఎమ్ఎన్ఎమ్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి

234 స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.