
జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిల్చున్న అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ దంపతులు

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటోన్న టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొన్న టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు, అతని తనయుడు

జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

జీవీఎంసీ ఎన్నికల్లో భాగంగా ఎం.వీ.పీ. కాలనీలో ఉన్న సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్ లో 17వ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకుంటోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ఓటు వేస్తోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ఓటు హక్కు వినియోగించుకున్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివస్తుందని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో వైఎస్ జగనే చెప్పారని గుర్తు చేశారు మాజీ మంత్రి, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విశాఖ నగరపాలక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించుకోడానికి అన్ని పార్టీలు, వర్గాలు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని, దీనికి అధికార పార్టీ నాయకత్వం వహించాలని గంటా డిమాండ్ చేశారు.