పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆలిండియా ట్రేడర్స్ భారత్ బంద్ నిర్వహించింది. బంద్‌కు దేశ వ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో పాటు అఖిలభారత వాహనదారుల సంక్షేమ సంఘం కూడా సంపూర్ణ మద్దతు పలికింది. పెరుగుతున్న పెట్రోలియం ధరలతోపాటు ఎలక్ట్రానిక్ వే బిల్లు నిబంధనలు, జీఎస్టీ తదితర అంశాలకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించారు.
-
-
పెరుగుతున్న పెట్రోలియం ధరలతోపాటు ఎలక్ట్రానిక్ వే బిల్లు నిబంధనలు, జీఎస్టీ తదితర అంశాలకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించారు. దీంతో దేశవ్యాప్తంగా చాలాచోట్ల రవాణా రాకపోకలు నిలిచిపోయాయి.
-
-
దేశవ్యాప్తంగా సుమారు 40,000 ట్రేడ్ అసోసియేషన్లు తమ మద్దతును ప్రకటించాయి. దీంతో వర్తక, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.
-
-
జాతీయ రాజధానిలోని వివిధ మార్కెట్లు మూతపడ్డాయి.
-
-
సిమ్లాలో కార్మిక సంఘాలు మద్దతు పలకడంతో వ్యాపారులు భారత్ బంద్‌లో పాల్గొన్నారు. మంచు కురుస్తున్నా బంద్ నిర్వహించారు.
-
-
భారత్ బంద్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో ట్రేడ్ యూనియన్ నేతలు రైల్‌రోకో చేపట్టారు.
-
-
భారత్ బంద్‌కు దేశంలోని దాదాపు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలపగా సుమారు 8 కోట్ల మంది వ్యాపారులు బంద్‌లో పాల్గొన్నారు.
-
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, దేశ వ్యాప్తంగా ధరలు ఒకే విధంగా ఉండాలని ఆల్ ఇండియా ట్రేడర్స్ డిమాండ్ చేసింది.