Tirumala: ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు.. చిత్రాలు

|

Jan 13, 2022 | 1:32 PM

దేవదేవుడు కొలువైన సప్తగిరులు ఎప్పుడూ శోభాయమానంగానే దర్శనమిస్తుంటాయి. ముక్కోటి ఏకాదశి రోజు అటు ప్రకృతి కూడా సహకరించినట్టు పొగమంచుతో రమణీయంగా తయారయ్యాయి తిరుమలగిరులు.

1 / 14
దేవదేవుడు కొలువైన సప్తగిరులు ఎప్పుడూ శోభాయమానంగానే దర్శనమిస్తుంటాయి. సెలయేళ్లు, పక్షుల కిలకిలరావాలతో అలరారే ఏడుకొండలు ఇవాళ మరింత అందంగా ముస్తాబయ్యాయి. ముక్కోటి ఏకాదశి రోజు అటు ప్రకృతి కూడా సహకరించినట్టు పొగమంచుతో రమణీయంగా తయారయ్యాయి తిరుమలగిరులు.

2 / 14
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయం రంగురంగుల పుష్పాలతో ముస్తాబైంది. ఒకవైపు శ్రీవారి స్వర్ణ రథం కదిలి వస్తుంటే.. ఏడుకొండలపై పొగమంచు పరుచుకుంది. సృష్టిలోని అందమంతా అక్కడే కొలువై ఉందా ? అనే చందంగా ఏడుకొండలు కనువిందు చేస్తున్నాయి. సప్తగిరులకు ప్రకృతి కొత్త అందాలద్దింది.

3 / 14
ముక్కోటి ఏకాదశి రోజు  వైకుంఠ ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకుంటే ముక్తిని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే వీఐపీ రాత్రి ఒంటి గంటనుంచి 4 గంటల వరకు, సాధారణ భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

4 / 14
ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు వీఐపీలు, వీవీఐపీలు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ వరకు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

5 / 14
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఊరేగుతున్న స్వర్ణ రథాన్ని లాగి పునీతులయ్యారు ప్రముఖులు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు శ్రీవారిని దర్శించుకున్నారు.

6 / 14
ఉదయం నైవేద్య విరామ సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, హీరో అశోక్ గల్ల, హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ శ్రీ రామ్ అధిత్య ఆలయంలోకి వెళ్లి స్వామివారి మూలవిరాట్టును దర్శించుకున్నారు

7 / 14
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. తెల్లవారుజాము నుంచే  వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు.

8 / 14
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతమంటున్నారు ఎమ్మెల్యే రోజా. ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదన్నారు.

9 / 14
రైతులతో పాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నానని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందని తెలిపారు.

10 / 14
ఏపీ మాజీ హోంమంత్రి చినరాజప్ప తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు రోజుకు లక్ష మందికి దర్శనం లభించేదని, ఇప్పుడు రోజుకు 30 వేల మందికి మాత్రమే స్వామి దర్శనం లభిస్తోందన్నారు.

11 / 14
వైకుంఠ ద్వారా దర్శనం ద్వారా వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ 45 వేల మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.

12 / 14
 స్వామి వారిని దర్శించుకుంటే ముక్తిని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే వీఐపీ రాత్రి ఒంటి గంటనుంచి 4 గంటల వరకు, సాధారణ భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

13 / 14
సుప్రీంకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ వరకు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

14 / 14
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఊరేగుతున్న స్వర్ణ రథాన్ని లాగి పునీతులయ్యారు ప్రముఖులు.