
ఇది వరకు రోజుల్లో పొలం పనులకు వెళ్లే వాళ్ళు , పొయ్యి ముట్టించకుండానే, నూనె కొంచం కూడా వాడకుండా, చాలా ఈజీగా చేసే చ్చడిని తమ అన్నంలోకి లేదా టిఫిన్స్ లోకి నంచుకుని తినేవాళ్లు. అదే పాత కాలంన నాటి పొలం పచ్చడి. తక్కువ పదార్థాలతో కొద్దీ నిముషాల్లోనే సమయంలో చేసుకోగల ఈ పచ్చడి ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను తీసుకుని వాటిని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ ఉల్లిపాయను మీడియం సైజులో కట్ చేసి దానిలో ఘాటు తగ్గడానికి నీటిలో వేసుకోవాలి. ఇంకా ఈ పచ్చడిని రోటిలో చేయడం వలన మంచి రుచి వస్తుంది. రోలు లేనివారు మిక్సీలో కొంచం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు.

పల్లెటూరి పొలం పచ్చడికి కావాల్సిన పదార్థాలు : 100 గ్రాములు పచ్చి మిర్చి, కొద్దిగా చింతపండు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.

ముందుగా రోట్లో పొడి జీలకర్ర వేసి దంచుకోవాలి. ఈ పచ్చడికి పొయ్యి అవసరం లేదు కాబట్టి, జీలకర్రను పచ్చిగానే వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నానబెట్టిన సైజు చింతపండును కూడా వేసి దంచాలి. చింతపండు బాగా నానితే ఈజీగా దంచుకోవచ్చు. ఇంకా దీనిలో పది వెల్లుల్లి రెబ్బలను వేసి మెత్తగా అయ్యేవరకు దంచుతూనే ఉండాలి.

రుచికి తగినంత ఉప్పు వేసి మెత్తగా అయ్యేలా దంచాక, ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇంకా ఈ పచ్చిమిర్చిని మొత్తం కాకుండా ఒక్కొక్కటిగా దీనిని దంచుకోవాలి. ఇలా వేయడం వలన పచ్చిమిర్చి నలిగి ఈ పచ్చడికి మంచి రుచి వస్తుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవడమే.