- Telugu News Photo Gallery PM Narendra modi inaugurates Nagpur metro and interacts with students and people while metro ride Telugu National News
PM Modi: నాగ్‌పూర్ మెట్రో ప్రారంభం తర్వాత విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ నాగ్‌పూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా నాగ్‌పూర్ మెట్రోతో పాటు, బిలాస్‌పూర్-నాగ్‌పూర్‌ల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు..
Updated on: Dec 11, 2022 | 12:14 PM

Modi నాగ్‌పూర్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ మొత్తం రూ. 75,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ట్రోతో పాటు, నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో నాగ్‌పూర్ మరియు బిలాస్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ స్వయంగా టికెట్ కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణించారు.

అంతేకాకుండా నాగ్‌పూర్ మెట్రో ఫేజ్-1ని ప్రారంభించిన వెంటనే ప్రధాని నాగ్‌పూర్ మెట్రో ఫేజ్ సెకండ్ ఫేజ్‌కు శంకుస్థాపన చేశారు. అనంతం ఫ్రీడమ్ పార్క్ స్టేషన్‌లో టికెట్ కొనుగోలు చేసిన ప్రధాని ఖాప్రీ వరకు మెట్రోలో ప్రయాణించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పర్యటించారు. ఈ సందర్భంగా మెట్రోను ప్రారంభించి ప్రజలకు కానుకగా అందించారు. మెట్రో ప్రారంభం అనంతరం ప్రధాని స్వయంగా టికెట్ కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణించారు.

మెట్రోలో ప్రయాణించే సమయంలో మోదీ పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. కొందరు మెట్రో అధికారులతో పాటు విద్యార్థులను మోదీ నవ్వుతూ పలకరించారు.

నాగ్‌పూర్ మెట్రో ఫస్ట్ ఫేజ్‌లో మొత్తం 36 స్టేషన్లు ఉన్నాయి. 40 కి.మీల పొడవున్న మెట్రో ఫస్ట్ ఫేజ్ నిర్మాణానికి రూ. 8650 కోట్లు ఖర్చు చేశారు. ఇక రెండో దశను రూ. 6700 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.




